యూట్యూబ్‌ సూపర్ స్టార్‌ ను కలిసిన ముగ్గురు మొనగాళ్లు

Update: 2022-03-15 11:58 GMT
తెలుగు ప్రేక్షకులు.. సౌత్‌ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ సినీ ప్రేమికులు ప్రేక్షకులు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఆర్‌ఆర్ఆర్‌. ఎలాంటి అనుమానం లేకుండా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25వ తారీకున ఓ రేంజ్ లో కుమ్మేయడం ఖాయం. భారీ అంచనాల నడుమ ఏకంగా 550 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమా రూపొందింది.

సినిమా ను ఎంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తాడో అంతే ప్రతిష్టాత్మకంగా సినిమాను ప్రమోట్‌ చేస్తూ ఉంటాడు. సినిమా ప్రమోషన్ విషయంలో ఎక్కడ కూడా రాజమౌళి నిరుత్సాహపర్చకుండా సినిమా రేంజ్ ను పెంచే విధంగా మాత్రమే ఆయన హడావుడి ఉంటుంది. ప్రమోషన్‌ లో కూడా ప్రత్యేక స్థానంను కలిగి ఉండే రాజమౌళి ఈ సినిమాను యూట్యూబ్‌ సూపర్ స్టార్ గా నార్త్‌ వారు పిలిచే భువన్‌ బమ్‌ తో ఇంటర్వ్యూ చేశారు.

భూవన్ బమ్‌ చాలా ఫేమస్‌ యూట్యూబర్‌. ఆయన కామెడీ స్కిట్స్ తో పాటు ఆయన ప్రతి వీడియో కూడా ట్రెండ్ అవుతూ ఉంటుంది. పాతిక లక్షల మిలియన్‌ సబ్‌ స్క్రైబర్స్ ఉన్న భువన్‌ బమ్‌ కు తో కలిసి ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాకు చెందిన ముగ్గురు మొనగాళ్లు రాజమౌళి.. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు ఇంటర్వ్యూలో పాల్గొనడంతో ఖచ్చితంగా సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఇతగాడి ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా సరదాగా ఉంటుందనే నమ్మకం అందరి లో ఉంటుంది. సౌత్‌ లో పెద్దగా ప్రాచుర్యం లేనప్పటికి ఉత్తర భారతంలో ఇతడి యొక్క సందడి భారీగానే ఉంటుంది. కనుక జక్కన్న టీమ్‌ ఆ యూట్యూబర్ ను ఈ సినిమా ప్రమోషన్ కోసం అప్రోచ్ అయ్యారనే టాక్‌ వినిపిస్తుంది. ఆయన చేసిన ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగిపోయింది అంటూ యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో భువన్ బమ్‌ వంటి ప్రముఖ సోషల్‌ మీడియా స్టార్స్ తో చేయడం వల్ల ఖచ్చితంగా ఆ హైప్ ను మరింతగా పెంచిన వాళ్లం అవుతారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకం అన్నట్లుగానే ఇప్పటి వరకు ఏ సౌత్‌ ఇండియా సినిమా గురించి ముచ్చటించని భూవన్‌ బమ్‌ కి చెందిన యూట్యూబ్‌ ఛానల్‌ బిబి వైన్స్ లో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఇంటర్వ్యూ వచ్చింది. ఇదే మన జక్కన్న స్థాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Full View
Tags:    

Similar News