'RRR' గ్లోబ‌ల్ మూవీ అయితే 'బాహుబ‌లి' 'ఔట్!'

Update: 2022-03-17 02:30 GMT
`బాహుబ‌లి` త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఇద్ద‌రు బిగ్ స్టార్లు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌ను ఒకే వేదిక‌పై తీసుకొచ్చి `ఆర్ ఆర్ ఆర్` అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇలా ఇద్ద‌రు అగ్ర హీరోల్ని ఒకే వేదిక‌పైకి  తీసుకురావ‌డమే పెద్ద సాహ‌సం.

అలాంటింది ఏకంగా ఇద్ద‌ర్నీ బ్యాలెన్స్ చేస్తూ దాదాపు మూడు సంవ‌త్స‌రాల పాటు వాళ్ల‌తో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. కేవ‌లం ఆ ఇద్ద‌రు స్టార్లు జ‌క్క‌న్న‌పై న‌మ్మ‌కంతోనే ప‌నిచేసారు అన్న‌ది వాస్త‌వం.

ఈ మూడేళ్ల‌లో రెండు సినిమాలు చేసి అంత‌కు మించి సంపాదించే అవ‌కాశం ఉన్నా...వాటిని సైతం కాద‌నుకుని త‌మ క్రేజ్ ని బిల్డ్ చేసుకోవాల‌న్నా ఒకే ఒక్క  కార‌ణంగా తార‌క్...చ‌ర‌ణ్ అలా ఫిక్సై ముందుకు సాగారు. ఆ ఇద్ద‌రి స్టార్ల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని జ‌క్క‌న్న స్వాతంత్ర్య‌ స‌మ‌ర‌యోధుల క‌థ‌ని త‌న‌దైన శైలిలో చెప్ప‌బోతున్నారు.

ఒక‌రు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తుంటే...మ‌రొక‌రు కొమ‌రం భీమ్ పాత్ర‌ని పోషిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని మార్చి 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి జ‌క్క‌న్న‌..తార‌క్ ఆస‌క్తిక‌ర సంగ‌తులు చెప్పుకొచ్చారు.

`ఆర్ ఆర్ ఆర్` క‌థ వేరే ద‌ర్శ‌కుడు చెప్పి ఉంటే చేసే వాడిని కాదు. చెప్పిన క‌థ‌ని చెప్పిన‌ట్లు తీయ‌డం అంద‌రికీ రాదు. అది ఒక్క జ‌క్క‌న్నకే సాధ్యం. ఇక ముందు తెలుగు సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలే. ఇండ‌స్ర్టీ నెక్స్ట్ లెవ‌ల్ కి  వెళ్తుంది. తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే అంద‌రూ ఎదురు చూస్తారు. ఆ రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్నారు ఎన్టీఆర్.

`మ‌గ‌ధీర` త‌ర్వాత భారీ బ‌డ్జెట్ చిత్రాలు..ఎక్కువ రోజులు పాటు షూటింగ్ ఉండే సినిమాలు చేయ‌కూడ‌ద‌నుకున్నా. అందుకే `ఈగ‌`..`మ‌ర్యాద‌రామ‌న్న` లాంటి చిత్రాలు చేసాను. అలాగే `బాహుబ‌లి` త‌ర్వాత పెద్ద సినిమా ఇక నావ‌ల్ల కాదు అనుకున్నా. కానీ  రాంగోపాల్ వ‌ర్మ స్ఫూర్తితో ఆ మాట‌ని ప‌క్క‌న‌బెట్టి `ఆర్ ఆర్ ఆర్` తీసాను. `బాహుబ‌లి` కంటే పెద్ద సినిమాగా ఉంటుంది. రికార్డులు తిర‌గ‌రాస్తాన‌ని ఎప్పుడు ముందు చెప్ప‌ను.

అలాగే `ఆర్ ఆర్ ఆర్`  గ్లోబ‌ల్ సినిమా కాదు. ప్ర‌పంచంలో ప్ర‌తీ చోట తెలుగువారు ఉన్నారు. వాళ్లు మాత్ర‌మే చూస్తే గ్లోబ‌ల్ సినిమా అవ్వ‌దు. వీదేశీ ఆడియ‌న్స్ మ‌న సినిమాలు చూడాలి. అలా `బాహుబ‌లి`ని జపాన్ ఆడియ‌న్స్ ఆద‌రించారు కాబ‌ట్ట‌లి ఆ సినిమా గ్లోబ‌ల్ సినిమాగా చెప్పొచ్చు. చ‌ర‌ణ్‌-తార‌క్ ఈ సినిమా చేయ‌డానికి అంగీక‌రించ‌మే పెద్ద  త్యాగం.  

నాలుగేళ్ల పాటు నాతోనే  ప్ర‌యాణించారు. అందులో రెండేళ్లు క‌రోనాకి కేటాయించినా...రెండేళ్లు నాతోనే. ఈ గ్యాప్ లో మూడు సినిమాలు చేయోచ్చు. మంచి పారితోషికం వ‌చ్చేది. కానీ అవేమి ఆశించ‌లేదు. ఈ సినిమా కోసం అంతా ఎగ్జైట్ మెంట్ తో ప‌నిచేసామ‌ని`` రాజ‌మౌళి అన్నారు.
Tags:    

Similar News