రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లో లేదా సౌత్ లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉత్తరాదిన బాహుబలి దక్కించుకున్న విజయం కారణంగా ఈ సినిమా బజ్ అంతా ఇంతా లేదు. జక్కన్న పేరు చెప్తే అక్కడ అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా బాహుబలిని మించి అక్కడ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబయిలో కొన్ని రోజుల క్రితం నిర్వహించారు. సాదారణంగా ఎక్కడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అన్ని ఛానల్స్ కు లైవ్ ఇస్తారు. కాని ముంబయిలో జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ ఇవ్వలేదు.
కనీసం ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలను కూడా రివీల్ చేయలేదు. ఒక్కటి రెండు ఫొటోలు తప్ప ఆ ఈవెంట్ లో ఏం జరిగింది అనే విషయాన్ని రివీల్ చేయలేదు. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో ఆ ఈవెంట్ ను చూసేందుకు జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు.
అంతే కాకుండా సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్ ఈ ఈవెంట్ లో పాల్గొనడం వల్ల కూడా అందరి దృష్టి ఉంది. ఆ ఈవెంట్ ను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారా అనుకుంటూ ఉండగా జీ వాళ్లు నేడు రాత్రి 11 గంటలకు టెలికాస్ట్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కొత్త సంవత్సరంకు జీ టీవీ మరియు జీ సినిమా ఛానల్స్ లో ఈ ఈవెంట్ ను టెలికాస్ట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ఈ టెలికాస్ట్ రైట్స్ ను జీ సంస్థ వారు భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. జీ సంస్థ ఇప్పటికే సినిమా రైట్స్ ను కూడా దక్కించుకున్న విషయం తెల్సిందే. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తో మరోసారి బాలీవుడ్ లో తన సత్తా చాటబోతున్నాడు.
బాహుబలి తో సాధించిన వసూళ్లను ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా దక్కించుకోలేదు. దాంతో బాలీవుడ్ బిగ్ స్టార్స్ కూడా రాజమౌళి అంటే ప్రత్యేకమైన గౌరవంతో ఉంటారు. అలాంటి రాజమౌళి సినిమా ఈవెంట్ అది కాకుండా సల్మాన్ ఖాన్ పాల్గొన్న ఈవెంట్ అవ్వడం వల్ల ఆర్ ఆర్ ఆర్ ముంబయి ఈవెంట్ ను నేడు రాత్రి పెద్ద ఎత్తున సదరు ఛానల్స్ లో ప్రేక్షకులు చూడటం ఖాయం. కేవలం ఉత్తరాది వారు మాత్రమే కాకుండా సౌత్ వారు కూడా నేడు రాత్రి ఆ ఈవెంట్ ను చూడబోతున్నారు.