రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా అది ముందుగా చెప్పిన డేట్ కు రాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం జులై 30 2020న విడుదల చేస్తామంటూ జక్కన్న ప్రకటించాడు. కాని మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. సినిమా క్వాలిటీగా రావాలంటే తప్పడం లేదు అంటూ సోషల్ మీడియా ద్వారా సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
2021 సంక్రాంతి కానుకగా జనవరి 8వ తారీకున ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల వచ్చిన సంక్రాంతి సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. సంక్రాంతికి ఏ సినిమా విడుదల అయినా కూడా కాస్త పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు నమోదు అవుతాయి. అందుకే సంక్రాంతిని జక్కన్న అండ్ టీం టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.
సినిమా వాయిదా ప్రకటన ప్రేక్షకులు నిరాశ కలిగించినా కూడా క్లారిటీ ఇవ్వడంతో అంతా హ్యాపీగా ఉన్నారు. సినిమా విడుదల విషయంలో జక్కన్న ఏమాత్రం ఛాన్స్ తీసుకోడు. ఆలస్యం అవుతుంది కదా అని హడావుడిగా సినిమాను చుట్టేయడు. అందుకే ఈ చిత్రంను అనుకున్న సమయం కంటే ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు. ఆ డేట్ కు విడుదల అయినా కూడా హ్యాపీనే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.