'RRR' ఓవర్ సీస్ బిజినెస్ డీల్ క్లోజ్..!

Update: 2021-04-07 10:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్‌.ఆర్‌.ఆర్‌'' సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ - మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇకపోతే RRR ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ కూడా అమ్మడుపోయినట్లు మేకర్స్ వెల్లడించారు.

'ఆర్.ఆర్.ఆర్' మూవీ యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ సరిగమ సినిమాస్ మరియు రాఫ్తార్ క్రియేషన్స్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు దక్కించుకున్నట్లు తెలిపారు. దీని కోసం పోటీపడి మరీ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు టాక్. అక్టోబర్ 12న USA లో RRR ప్రీమియర్స్ పడనున్నాయి. ఇక తమిళ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు తీసుకున్నారు. కర్ణాటకలో ఏషియన్ మరియు వారాహి సంస్థలు ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. నార్త్ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ ని ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్తూడియోస్ వారు కొనుకోలు చేశారు. అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్-డిజిటల్-శాటిలైట్ హక్కులను కూడా పెన్ స్టూడియోస్ వాళ్లే దక్కించుకున్నారు.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సుమారు 450 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


Tags:    

Similar News