గుస‌గుస‌: RRR రిలీజ్ ముందే క‌ళ్లు భైర్లు క‌మ్మే లాభాలు?

Update: 2021-04-06 04:30 GMT
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR ప్రీరిలీజ్ బిజినెస్ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాకి దాదాపు 500కోట్ల మేర రిలీజ్ ముందే లాభాలు జేబులో వేసుకుంటున్నార‌న్న చ‌ర్చ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో వేడెక్కిస్తోంది.

ఈ సినిమా పెట్టుబ‌డి మొత్తం ఇప్ప‌టికే మూడు భాష‌ల రిలీజ్ హ‌క్కుల రూపంలో వెన‌క్కి వ‌చ్చేసింద‌న్న విశ్లేష‌ణ ఇంత‌కుముందు సాగింది. నాన్ థియేట్రిక‌ల్ రూపంలో వ‌చ్చే మొత్తం అంతా లాభాల ఖాతాకే చెందుతుంద‌న్న విశ్లేష‌ణ ఆస‌క్తిని రేకెత్తించింది. తాజా స‌మాచారం మేర‌కు  శాటిలైట్.. అలాగే అన్ని భాషల డిజిటల్ హక్కులు.. నాన్-థియేట్రికల్ హక్కులు క‌లుపుకుని రూ.450 కోట్ల బిజినెస్ సాగించింద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. మూడు భాష‌లు మిన‌హాయించి సౌత్ లో ఇత‌ర భాష‌ల థియేట్రిక‌ల్ బిజినెస్ రూపంలోనూ మ‌రో 50కోట్లు అద‌నంగా ద‌క్క‌నుంద‌న్న అంచ‌నా వేస్తున్నారు.

ఈ లాభంలో స‌గం ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళికి ద‌క్కితే మిగిలిన మొత్తాన్ని నిర్మాత డీవీవీ దాన‌య్య త‌న ఖాతాలో వేసుకుంటార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. లాభం 50ః 50 ప్రాతిప‌దిక‌న దర్శ‌కుడు నిర్మాత‌కు పంపిణీ సాగ‌నుందిట‌. ఇందులోంచి హీరోల పారితోషికాలు సినిమా రిలీజ్ ఆల‌స్యం అవ్వ‌డంతో పోయే పెట్టుబ‌డులు ఇత‌ర‌త్రా వ‌దిలేస్తే రాజ‌మౌళి.. దాన‌య్య ల‌కు ఒక్కొక్క‌రికి రూ.200కోట్ల మేర ద‌క్క‌నుంద‌ని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇది సౌతిండియా హిస్ట‌రీలోనే అరుదైన రికార్డ్ అని భావించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News