దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). 2022, జనవరి 7వ తేదీన విడుదల కాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన RRR ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. ఇందులో భాగంగా పలు ప్రధాన నగరాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు.
RRR ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోన్న నేపథ్యంలో చిత్ర బృందం ముంబై - బెంగుళూరు - చెన్నై నగరాల్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మొన్న క్యాన్సిల్ అయిన తెలుగు మీడియా మీట్ ని ఈరోజు శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ - అలియా భట్ - డీవీవీ దానయ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్ పై వస్తోన్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపిన ‘RRR’ టీమ్.. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా రాజమౌళి చెప్పిన విశేషాలు...
* 'ఆర్.ఆర్.ఆర్' సినిమా హిస్టరీ బేస్డ్ సినిమా కాదు.. ఇది అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవితాల స్పూర్తితో పూర్తిగా కల్పిత కథతో తీసిన సినిమా. దేశభక్తి అంతర్లీనంగా ఉంటుంది కానీ మూవీ మాత్రం కంప్లీట్ గా ఇద్దరి మధ్య స్నేహం మీద ఉంటుంది.
* ఈ సినిమా లో రామ్ మరియు భీమ్ పాత్రలు వర్కవుట్ అవ్వాలంటే ఆడియన్స్ వీళ్ళిద్దరిని ఈక్వల్ గా ఫీల్ అవ్వాలి. దాని కోసం చాలా బ్యాలన్స్డ్ గా తీసుకెళ్ళాం.
* మల్టీ స్టారర్ చేయడానికి ప్రతి హీరో సిద్ధంగా ఉంటాడు. వారి పాత్ర మరియు కథ బాగుండాలి. కానీ భయం ఏంటి అంటే ఫ్యాన్స్ తీసుకుంటారా? చూస్తారా? అనేదే. ఒకసారి RRR విడుదలై అద్భుతమైన రన్ పొందితే, ఇకపై ఖచ్చితంగా మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు వస్తూనే ఉంటాయి.. రావాలని ఆశిస్తున్నాను.
* ముగ్గురం కలసి సినిమా చేద్దాం అని తారక్ - చరణ్ లకు చెప్పా. కానీ ఏ మూవీ అని వాళ్ళిద్దరికీ తెలియదు. నేను స్టోరీ క్లియర్ గా చెప్పలేదు. జస్ట్ ఔట్ లైన్ చెప్పాను. ఇద్దరూ వెంటనే ఓకే అన్నారు.
* ఈ సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ మధ్య ఉండే బ్రోమాన్స్ చూస్తే, రొమాన్స్ లేదు అనే ఫీలింగే రాదు.
* 'నాటు నాటు' పాటలో జస్ట్ వాళ్ళు వేసిన రెండు మూడు విజువల్స్ చూపించా. కానీ ఈ సాంగ్ లో ఉండే ఎమోషన్స్ సినిమాలో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు పెద్ద హీరోలు కలిసి చేసినట్లు ఉండదు.
* నేను మనసులో అనుకున్నది స్క్రీన్ మీద రావడానికి కష్టపడే యాక్టర్స్ మరియు టెక్నిషిన్స్ ఉండటం వల్లే అలాంటి సినిమాలు తీయడం నాకు ఈజీ అవుతోంది