RRR సీక్వెల్ క‌న్ఫామ్ చేసిన రాజ‌మౌళి

Update: 2022-12-23 17:00 GMT
2022 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లో RRR స్థానం గురించి తెలిసిందే. దాదాపు 1000 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించి టాప్ స్లాట్ ని అందుకుంది. అయితే ఈ సినిమాకి రాజ‌మౌళి సీక్వెల్ ని తెర‌కెక్కించే ఆస్కారం ఉందా? అంటూ చాలా కాలంగా ప‌లువురు క్రిటిక్స్ ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు సందేహాలు వ్య‌క్తం చేసారు. తాజాగా జ‌క్క‌న్న నుంచి ఆన్స‌ర్ రానే వ‌చ్చింది. ఆర్.ఆర్.ఆర్ కి సీక్వెల్ క‌థ‌ను రెడీ చేస్తున్నామ‌ని పాపుల‌ర్ విదేశీ మ్యాగ‌జైన్ `వెరైటీ`తో రాజ‌మౌళి ఖ‌రారు చేసారని క‌థ‌నాలొస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ లతో సీక్వెల్ ను రాజ‌మౌళి ధృవీకరించారు. `మేం దీనిపై తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌`ని రాజ‌మౌళి ఆ ఇంట‌ర్వ్యూలో అన్నారు. బ్రిటీష్ వారిపై వీరుల యుద్ధం కొన‌సాగుతుంద‌ని కూడా `వెరైటీ` క‌థ‌నం పేర్కొంది. ప్ర‌స్తుతం RRR `ఆస్కార్` ప్ర‌చార బ‌రిలో ఉన్న రాజ‌మౌళి తన తండ్రి గారైన‌ స్క్రీన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో మంత‌నాలు సాగించాన‌ని తెలిపారు. ``సీక్వెల్ కథపై సీరియస్ గా పని చేస్తున్నారు`` అని `వెరైటీ`కి తెలిపారు. విప్లవ వీరులు మరోసారి వార్ లోకి వ‌స్తార‌ని ధృవీక‌రించారు.

మూడు గంటల నిడివి ఉన్న‌ యాక్షన్-మ్యూజికల్ ఇతిహాసం-RRR  ఇటీవ‌ల‌ రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ లను సంపాదించి వార్తల్లో నిలిచింది. `నాటు నాటు` ట్రాక్ కోసం ఒరిజినల్ సాంగ్ తో పాటు ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రంగా RRR రికార్డుల‌కెక్కింది. అలాగే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ లో రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది. ఈ విజ‌యాల‌తో రాజ‌మౌళి రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. అత‌డు హాలీవుడ్ మీడియాల‌తో మాట్లాడుతూ సీక్వెల్ గురించిన ఆలోచ‌న‌ల‌ను పంచుకోవ‌డం హాట్ టాపిక్ గా మారుతోంది.

పాపుల‌ర్ `వెరైటీ` మ్యాగ‌జైన్ తో రాజ‌మౌళి మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. నిజానికి తొలుత RRR సీక్వెల్ గురించి ఆలోచించ‌లేదని అయితే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించడంతో సీక్వెల్ కి ఇది మంచి త‌రుణంగా మారింద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు స‌ద‌రు `వెరైటీ` క‌థ‌నం ఉటంకించింది. మొద‌టి భాగం చిత్రీక‌రించే స‌మ‌యంలో సీక్వెల్ ఆలోచన లేదని రాజ‌మౌళి స్ప‌ష్ఠంగా తెలిపారు. RRR విజయం సాధించిన త‌ర్వాత‌ సీక్వెల్ పైనా కొంత చర్చించాం. కొన్ని మంచి ఆలోచనలను షేర్ చేసుకున్నాం. కానీ సీక్వెల్ తీసేంత‌ గొప్ప ఆలోచనను క‌నుగోలేదు. ఆ త‌ర్వాత దానిని వదిలివేసాం`` అని అన్నారు.

రాజ‌మౌళి ఇంకా మాట్లాడుతూ-``అంతర్జాతీయ విజయం తర్వాత సీక్వెల్ అనే టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చినప్పుడు నా సోద‌రుడు (గోల్డెన్ గ్లోబ్ కి-నామినేట్ అయిన‌ సంగీత స్వరకర్త M. M. కీరవాణి).. నా కోర్ టీమ్ లో భాగ‌స్వామి త‌న‌కు తోచిన ఒక ఆలోచన మాకు చెప్పారు. ``ఓ మై గాడ్.. ఇది చాలా గొప్ప ఆలోచన... కొనసాగించదగిన ఆలోచన`` అనిపించింద‌ని తెలిపారు. ఆ త‌ర్వాత తన తండ్రి గారైన విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి ఇతరులకు కథను వివరించి మొదటి డ్రాఫ్ట్ ను రెడీ చేయించారు. వెంటనే దానిపై కూర్చుని ఆలోచనను విస్తరించాల‌ని  ర‌చ‌యిత విజ‌యేంద్రుని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కోరార‌ట‌.

ప్రస్తుతం సీరియస్ గా కథపై వర్క్ జ‌రుగుతోంది. త‌న తండ్రిగారు క‌థ‌ను పూర్తి చేస్తున్నారు.. అని రాజమౌళి `వెరైటీ`తో తెలిపారు. కానీ ఈ స్క్రిప్ట్ పూర్తయినా కానీ.. దీన్ని ఎలా తెర‌కెక్కించాలి? ఎప్పుడు సెట్స్ కెళ్లాలి?  వ‌గైరా వ‌గైరా విష‌యాల‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు వెరైటీ క‌థ‌నం పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News