యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ మూవీ కోసం దాదాపు మూడున్నరేళ్లుగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఊహించని ఇద్దరు స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన మూవీ ఇది.
రెండు భిన్న నేపథ్యాలున్న ఫ్యామిలీస్ కి చెందిన ఇద్దరు హీరోలు కలిసి చేసిన సినిమా కావడం.. తెలుగు ప్రజల స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడిన ఇద్దరు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల కథకు ఫిక్షనల్ అంశాల్ని జోడించి వెండితెరపై వారి పాత్రలని ఫెరోషియస్ గా మలిచిన స్టోరీ కావడంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి.
అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఎలా నటించారో.. వారి పాత్రలని వెండితెరపై ఏవిధంగా ఆవిష్కరించారో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ యుఎస్ ప్రీమియర్స్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి రికార్డుల పరంపరకు శ్రీకారం చుట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగానే రికార్డులు మొదలు పెట్టిన `ఆర్ ఆర్ ఆర్` ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఇప్పటికే 20 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికినట్టుగా తెలుస్తోంది.
ఇండియన్ సినీ చరిత్రని తిరగరాయడానికి రెడీ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ విడుదలకు మరో 5 రోజులే మిగిలి వుండటంతో చిత్ర బృందం జోరుగా ప్రచార పర్వాన్ని ప్రారంభించేసింది. ఇప్పటికే దుబాయ్ లో క్రేజీ ఈవెంట్ ని పూర్తి చేసిన టీమ్ శనివారం కర్ణాకటలోని చిక్ మంగళూరులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి అక్కడి ప్రేక్షకులకు కనువిందు చేసింది.
ప్రస్తుతం టీమ్ గుజరాత్ లో సందడి చేస్తోంది. అక్కడి మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయిన చిత్ర బృందం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్ యునిటీ ముందుని సందర్శించి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ముందు హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పడు నెట్టింట వైరల్ గా మారాయి. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరూ చేతులు పట్టుకుని ఆర్ ఆర్ ఆర్ సిగ్నేచర్ స్టిల్ తో పోజులివ్వగా, మధ్యలో దర్శకుడు జక్కన్న నవ్వుతూ కనిపించారు.

Renowned film director @ssrajamouli & actors N T Rama Rao Jr. & Ram Charan visited Statue of Unity today. In their message they said we need to remind ourselves about virtues of Sardar Patel. It takes an ‘iron will’ to build such a statue, they added. @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/7wyijNr6u8
— Statue Of Unity (@souindia) March 20, 2022