రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా యూఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ నిన్న ఒక ప్రకటన చేశారు. రేపు తాము ఒక ఆసక్తికర ప్రకటనను చేయబోతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఇలాంటి రిలీజ్ దక్కలేదు అంటూ వారు ఈ సినిమా యూఎస్ రిలీజ్ గురించి గొప్పగా పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ సస్పెన్స్ లో ఉంచడంతో యూఎస్ సినీ ప్రేమికులు అంతా ఏంటి ఆ సర్ ప్రైజింగ్ విషయం అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
తాజాగా ఆ సస్పెన్స్ రివీల్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమాను యూఎస్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నాం. ఈ సమయంలో డిస్ట్రిబ్యూటర్ ప్రైవేట్ షోలను వేసేందుకు కూడా రెడీ అంటూ ప్రకటించారు. అంటే ఒక కమ్యూనిటీకి చెందిన వారు లేదంట ఒక ఫ్యామిలీకి చెందిన వారు స్నేహితులు ఇలా 40 మంది లేదా అంతకు ఎక్కువ మంది కలిసి ప్రత్యేక షో కావాలని అడిగితే.. కోరుకుంటే వారికి ఏ ప్రాంతంలో కావాలి.. ఎక్కడ కావాలి అనేది తెలియజేస్తే వెంటనే వారికి తగ్గ సమయంలో షో ను అరేంజ్ చేయబోతున్నట్లు గా ప్రకటించారు.
ఈ అవకాశాన్ని భారీ స్థాయిలో యూఎస్ లో ఉన్న సినీ ప్రేమికులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు ఇతర ఇండియన్ కలవడం కోసం సందర్బం ను వెదుక్కుంటూ ఉంటారు. ఇది వారికి సరైన సందర్భంగా డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలుస్తారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఈ ప్రైవేట్ షో లను భారీ ఎత్తున వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ షోల ద్వారా ఎక్కువ వసూళ్లు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. 40 మంది కలిసి సరదాగా సినిమా చూడాలి అనుకుంటే ప్రైవేట్ షో వేసేందుకు సిద్ధం అంటూ డిస్ట్రిబ్యూటర్ ప్రకటించడంతో ఈ ప్రమోషన్ పబ్లిసిటీ ఏదో బాగుంది అంటూ అంతా కూడా చర్చించుకుంటున్నారు.
రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ నటించగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు పాటలు చెప్పకనే చెబుతున్నాయి. సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయం అన్నట్లుగా సమాచారం అందుతోంది.