మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR రిలీజ్ వాయిదా చాలా గందరగోళానికి కారణమైంది. తదుపరి పెద్ద రిలీజ్ లకు ఇది సంకటంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ 1 రిలీజ్ తేదీపై ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ కన్నేయడంతో అదే తేదీకి విడుదలవుతున్న సర్కార్ వారి పాట సన్నివేశం ఏమిటో? అన్న చర్చా సాగుతోంది.
రాజమౌళి కొన్ని రోజుల క్రితం RRR రిలీజ్ డేట్ కోసం తర్జనభర్జన పడగా మహేష్ అండ్ సర్కార్ వారి టీమ్ అనూహ్యంగా డేట్ ని మార్చుకునేందుకు అంగీకరించారు. రాజమౌళి ఆ తర్వాత తన కోసం వాయిదా వేయడానికి అంగీకరించిన కొందరు నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేసారు. సర్కారు వారి పాట నిర్మాతలు కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ కోసం సర్కార్ వారి పాట నిర్మాతలు పెద్ద త్యాగం చేశారంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. అయితే షూటింగ్ పార్ట్ పూర్తి కాకపోవడంతో సర్కార్ వారి పాట సినిమా ఏప్రిల్ 1కి వాయిదా పడింది.
తాజాగా మరోసారి రిలీజ్ తేదీ విషయమై RRR వర్సెస్ సర్కార్ వారు తప్పదని భావిస్తున్నారు. ఏప్రిల్ 1 తేదీని లాక్ చేయడానికి రాజమౌళి టీమ్ ప్రయత్నిస్తోందని సమాచారం. అంటే సర్కారు వారి పాటకు ఇది అతి పెద్ద దెబ్బ అని అర్థమవుతోంది. ఇది మహేష్ అభిమానులకు ఎంత మాత్రం రుచించే వ్యవహారం కానేకాదు. సర్కార్ వారి పాటకు సంబంధించి మరో 40 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. మహేష్ బాబు పాత్ర దాదాపు 30 రోజులు పడుతుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో షూట్ మార్చి వరకు కొనసాగవచ్చు. పరశురామ్ స్క్రిప్ట్ లో తుది మెరుగులు దిద్దడంతోనే ఈ ఆలస్యం అన్న చర్చా వేడెక్కిస్తోంది.
కారణం ఏదైనా కానీ సర్కారు వారి పాట ఏప్రిల్ 1వ తేదీకి రెడీ అవుతుందా లేదా? అన్నదానిపై పరశురామ్ అండ్ టీమ్ క్లారిటీనిస్తే బావుంటుంది. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి త్రివిక్రమ్ తో సెట్స్ కెళ్లేందుకు మహేష్ ఆసక్తిగా ఉన్నారు. దానిపైనా మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఏప్రిల్ 1 (ఫూల్స్ డే) రోజున విడుదల చేసే సినిమా ఏదీ? అన్నదానిపై స్పష్ఠత అవసరం. అది ఆర్.ఆర్.ఆర్ నా లేక సర్కార్ వారి పాట అవుతుందా? అన్నది వేచి చూడాలి.