క్రేజును బట్టి క్యాష్ చేసుకోవాలనే ఎత్తుగడ బిజినెస్ వర్గాల్లో కామన్. కానీ సాంప్రదాయాన్ని మీరి అతిగా ధరల్ని పెంచితే దాని పర్యవసానం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఇంతకుముందు బాహుబలి విషయంలో అమెరికా థియేటర్లు ఎంచుకున్న మార్గం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అక్కడ ఇష్టానుసారం ధరల్ని పెంచుకుని బాహుబలి టిక్కెట్లు అమ్మారన్న అపప్రదను మూటగట్టుకున్నారు. ఒకానొక సమయంలో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఈ సినిమాని బహిష్కరించాలి అన్నంత కోపోద్రిక్తులయ్యారని టాక్ వినిపించింది.
బాహుబలి 2 ప్రీమియర్ షోల టిక్కెట్ల ధర 30 డాలర్లను అధిగమించి 40డాలర్ల వరకూ కూడా వసూలు చేశారు అప్పట్లో. ఇది ఒక రకమైన ఆగ్రహానికి కారణమైంది. అసమంజసంగా అధిక టిక్కెట్ ఛార్జీల కారణంగా సినిమాను బహిష్కరించాలనే భావన ఏర్పడింది. అయితే ఈసారి అలాంటి తప్పిదం చేయకుండా ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు సాధారణ ధరలతోనే ప్రీమియర్ లను అందుబాటులోకి తెస్తున్నారు.
అమెరికాలో దాదాపు 999 మల్టీప్లెక్స్ లలో విడుదల కానుందని పంపిణీదారులు ప్రకటించారు. అమెరికాలో వేరొక భారతీయ సినిమా ఏదీ ఇంత పెద్ద రేంజులో విడుదల కాలేదు అంటే అతిశయోక్తి కాదు. RRR పంపిణీదారులు ప్రేక్షకులతో స్నేహపూర్వక విధానాన్ని అనుసరిస్తూ టిక్కెట్ ను సరసమైన ధరలకే అందిస్తున్నారు.
RRR ప్రీమియర్ల (తెలుగు వెర్షన్) టిక్కెట్ ల ధర సాధారణ స్క్రీన్ లలో 25 డాలర్లు(పెద్దలు)... 18 డాలర్లు (పిల్లలు) .. పెద్ద ఫార్మాట్ స్క్రీన్ లలో 28 డాలర్లు(పెద్దలు).. 20 డాలర్లు(పిల్లలు)గా నిర్ణయించారు. ఐమాక్స్ -డాల్బీ విజన్ స్క్రీన్ ల టిక్కెట్ ల ధర వరుసగా 30 డాలర్లు..35 డాలర్లుగా ఉన్నాయి. సాధారణ ప్రదర్శనలకు 22 డాలర్లు..ఐమ్యాక్స్ కి 30 డాలర్లు.. డాల్బీ విజన్ కి 35డాటర్ల వరకూ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి న్యాయబద్ధమైన ధరలు. అందువల్ల సినిమాపై పాజిటివిటీ నెలకొంటుంది. లాంగ్ రన్ లో చక్కని వసూళ్లను సాధించే వీలుంటుంది. RRR సంక్రాంతి కానుకగా జనవరి7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.