పిక్ టాక్‌ : హిట్‌ బ్యూటీ సైడ్‌ యాంగిల్‌ సెక్సీ ఫోజ్‌

Update: 2021-08-01 00:30 GMT
తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహాని శర్మ తెలుగు లో అక్కినేని హీరో మూవీ చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాలో ఈ అమ్మడి అందాల వింధుకు స్కోప్ దక్కలేదు. కేవలం నటనతోనే ఆ సినిమాలో మెప్పించింది. మొదటి సినిమా సక్సెస్ తో వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. విశ్వక్ సేన్‌ తో కలిసి హిట్‌ సినిమాలో నటించిన ఈ అమ్మడు బిజీ బిజీగా కెరీర్‌ లో సినిమాలు చేస్తూనే ఉంది. మొదటి సినిమాలో పద్దతిగా నటించిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా స్కిన్‌ షో కు సిద్దం అవుతోంది.

డర్టీ హరి సినిమాలో రుహాని శర్మ పాత్ర కు మరోసారి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం తెలుగు లో నూటొక్క జిల్లాల అందగాడు సినిమాను చేస్తోంది. సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచుతున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా ఫొటోలు షేర్‌ చేస్తూఉంది. స్కిన్‌ షో విషయంలో ఈ అమ్మడు ఏమాత్రం మొహమాటం లేకుండా వరుసగా పిక్స్‌ ను షేర్‌ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటోలు మరోసారి ఈమెను సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ అయ్యేలా చేసింది.

ఈ ఫొటోలో రుహాని శర్మను సైడ్‌ యాంగిల్‌ లో చూస్తే ఆహా అన్నట్లుగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎంత చూపించాలో అంతగా ఎలా చూపించాలో అలా అన్నట్లుగా ఈమె తన హాట్‌ సెక్సీ ఫోజ్ ను చూపిస్తూ... తన్మయత్వంలో మునిగి పోయి ఉన్న ఫోజ్‌ కు అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు భవిష్యత్తులో టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్ గా నిలవడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. హాట్‌ ఫోజ్‌ ఇచ్చిన రుహాని శర్మ భారీగా లైక్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి.


Tags:    

Similar News