మెగా డాటర్ నీహారిక హీరోయిన్ గా అరంగేంట్రం చేస్తోందంతే. ఆమె నటించిన తొలి సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి.. ఇంకా తను అరంగేట్రం చేయనట్లే. అయితే.. నీహారిక బిహేవియర్ అప్పుడే రూమర్స్ మొదలైపోయాయి. నాగశౌర్యకు జోడీగా మెగా డాటర్ నటించిన ఒక మనసు చిత్రాన్ని జూన్ 24న రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది.
అయితే ఒక మనసు ఫస్ట్ కాపీని సిద్ధం చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తుంటే.. నీహారిక మాత్రం ఇంకా తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు రావడం లేదంటున్నారు. ఆరోగ్యం బాగాలేదని, వేరే పనులు ఉన్నాయని, రికార్డింగ్ డేట్ మార్చమని.. ఇలా రకరకాల కారణాలతో తప్పించుకుంటోందట. అసలు ట్రైలర్ విషయంలోనే ఈ సమస్య వచ్చిందట నిర్మాతలకు. ట్రైలర్ రూపొందించేటపుడు కూడా ఇదే తరహాగా ఇబ్బంది పెట్టిందని అంటున్నారు.
ట్రైలర్ ని ఫైనలైజ్ చేస్తున్న సమయంలో వేరే యాక్టర్ తో డబ్బింగ్ చెప్పించి ఫినిష్ చేయడానికి ప్రొడ్యూసర్ ఫిక్స్ అయినపుడు.. ఆఖరి నిమిషంలో వచ్చిందట నీహారిక. అయితే.. ఆ సమయంలో వేరే ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయారని తెలుస్తోంది. 'మెగాస్టార్ ఎంత ఎత్తుకు ఎదిగినా సామాన్యంగా, సింపుల్ గానే ఉంటారు. కానీ ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఈమె మాత్రం యువరాణిలా ప్రవర్తించడం బాధాకరం' అనే మాట ఇండస్ట్రీ జనాల్లో వినిపిస్తోంది.