చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెర మీద అలరిస్తున్న సీనియర్ యాక్ట్రెస్ మీనా ఈమధ్య తన భర్త విద్యాసాగర్ ని కోల్పోయిన విషయం తెలిసిందే. కోవిడ్ తర్వాత అన్ హెల్తీ కారణంగా విద్యా సాగర్ మృతి చెందారు.
సెలబ్రిటీస్ విషయంలో మీడియా చూపించే అత్యుత్సాహం వల్ల చాలాసార్లు వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మీనా భర్త మృతి చెందిన టైం లో కూడా మీడియాలో రకరకాల వార్తలు రాసుకొచ్చారు. ఇక ఇప్పుడు భర్తను పోగొట్టుకున్న బాధలో ఉన్న మీనా రెండో పెళ్లికి సిద్ధం అంటూ న్యూస్ వైరల్ చేశారు.
భర్త ని దూరం చేసుకున్న బాధలో ఉన్న మీనా తనపై వస్తున్న ఈ వార్తలకు చాలా బాధపడ్డారు. తన వ్యక్తిగత విషయాల పట్ల మీడియా చేస్తున్న ఈ హడావిడి మీద ఫైర్ అయ్యారు. పెళ్లి వార్తలను తీవ్రంగా ఖండిస్తూ తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని మీనా కోరారు. సెలబ్రిటీస్ అందరి విషయంలో ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. వారు ఎంత మొత్తుకున్నా సరే వారి వ్యూస్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
మీనా భార్త విద్యాసాగర్ మరణం తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్లారు. అయితే మీనా పేరెంట్స్ ఆమెను మరో పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తున్నారట. మీనా మాత్రం ప్రస్తుతం భర్త ఆలోచనలతోనే కాలం గడుపుతున్నారు.
విద్యాసాగర్ ఐదు నెలల క్రితం దూరమవగా మీనా ఇప్పటికీ ఆ విషాదం నుంచి బయట పడలేదని తెలుస్తుంది. మీనాకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె భవిష్యత్తు దృష్ట్యా ఫ్యూచర్ లో సెకండ్ మ్యారేజ్ విషయంలో ఒక డెశిషన్ తీసుకోవచ్చేమో కానీ ఇప్పుడు మాత్రం ఈ వార్తలకు మరింత బాధకు గురవుతున్నారు మీనా.
తనని ఈ డిప్రెషన్ నుంచి బయట పడేందుకు సినిమాల్లో అయినా నటించాలని ఆమె కుటుంబ సభ్యులు సలహా ఇస్తున్నారు. కనీసం అలా సినిమాల్లో నటిస్తూ ఉన్నా సరే ఆ బాధలకు దూరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మీనా మాత్రం మరో ఏడాది పాటు సినిమాలు కూడా చేయనని చెబుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీనా సెకండ్ మ్యారేజ్ న్యూస్ కూడా ఆమెను మరింత బాధ పెట్టేలా చేస్తున్నాయి. మరి ఆమె ఇచ్చిన ఈ క్లారిటీతో అయినా ఇలాంటి వార్తలు ఆపేస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.