ప్రభాస్ సినిమాకి వంద కోట్లు రూమరే

Update: 2016-01-20 15:30 GMT
బాహుబలితో టాలీవుడ్ లో మొదటి వంద కోట్ల హీరోగా అవతరించాడు. శ్రీమంతుడి సినిమాతో మహేష్ బాబు కూడా ఆ మార్క్ దగ్గరకు వచ్చేశాడు. అయితే బాహుబలి 2 కూడా వంద కోట్ల మార్కును ఈజీగా దాటేస్తుందనేది గ్యారంటీ. అందుకే ఇప్పుడు ప్రభాస్ తో నిర్మాతలు వంద కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉంటున్నారని అంటున్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ చేయబోతున్న మూవీపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సుజిత్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ మూవీ చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పేశాడు. ఈ మూవీ కోసం వంద కోట్ల బడ్జెట్ పెడుతున్నారనే వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. అంటే ప్రభాస్ చేసే ప్రతీ మూవీకి వంద కోట్ల బడ్జెట్ ఖాయమే అంటున్నారు. అయితే. ఇందులో వాస్తవం లేదనే విషయం చాలామందికి తెలీడం లేదు. అదంతా కేవలం రూమర్‌. ఒక పోలీస్‌ ఆఫీసర్‌ స్టోరీతో ఒక కమర్షియల్‌ కథ తీస్తున్నారట. ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ కాకుండా.. ఒక 20 కోట్లలోనే సినిమా ఫినిష్‌ చేయాలని ప్లాన్‌ అని తెలుస్తోంది.

అంటే.. ఓ యాభై కోట్ల లోపే సినిమా ఫినిష్ అయిపోతుంది. కానీ మీడియాలో మాత్రం మీడియాలో ఇలా వంద కోట్ల రూమర్లు ఎక్కువగానే వస్తున్నాయి. వీటిని అధికారికంగా ఖండించడం లేదు యూనిట్ కూడా. తమకు ఊరికినే వచ్చే హైప్ ని వద్దనడం దేనికి అనుకుంటున్నారు నిర్మాతలు. కానీ ఈ తరహా ప్రచారం చేసే వాళ్లు కూడా కాస్త వాస్తవాలు తెలుసుకుంటే బెటర్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Tags:    

Similar News