చరణ్‌ అండ్ శర్వా.. జస్ట్ రూమర్!!

Update: 2016-11-09 16:00 GMT
రామ్ చరణ్.. శర్వానంద్ ల మధ్య మాంచి దోస్తీ ఉందనే మాట వాస్తవమే. వీలైనంత తరచుగా కలుస్తూ.. బోలెడన్ని సంగతులు చెప్పేసుకునేంత ఫ్రెండ్ షిప్ వీరి మధ్య ఉంది. కెమెరా ముందుకు ఇప్పటివరకూ కలిసి కనిపించలేదు కానీ.. ఆఫ్ స్క్రీన్ మాత్రం వీరిద్దరూ రచ్చ రచ్చ చేసేస్తూ ఉంటారు.

స్క్రీన్ పంచుకునే సందర్భం రాకపోయినా.. ఇప్పుడు రియల్ లైఫ్ లోనే చెర్రీ-శర్వాలు తోడల్లుళ్లు కాబోతున్నారనే రూమర్ ఒకటి బయల్దేరింది. మెగా పవర్ స్టార్ భార్య ఉపాసనకు చెల్లెలు వరసయ్యే అమ్మాయితో శర్వానంద్ పెళ్లి నిశ్చయం అయిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాల కోసం ఎంక్వైరీ చేస్తే.. అసలు శర్వా పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని.. ఇంట్లో పెద్దలు తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు శర్వా ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉండడంతో.. అసలు పెళ్లి కబుర్ల వరకు విషయం వెళ్లలేదని తెలుస్తోంది కూడా. ఇప్పటికే ఇరు వైపుల నుంచి పెద్దలు మాట్లేడసుకోవడం కూడా పూర్తయిపోయిందనే మాట కూడా వినిపిస్తోంది కాని.. అవన్నీ కేవలం రూమర్లేనట.

ఇప్పటికే ఫిలినంగర్ లో శర్వా పెళ్లి హాట్ టాపిక్ మారిపోయింది. ముందు నుంచి చెర్రీ- శర్వాల మధ్య ఫ్రెండ్ షిప్ ఉండడం కూడా.. ఇందుకు కారణం. అయితే.. ఆ రూమర్ అనేది ఉపాసన సిస్టర్ గురించి రావడం ఇంకా పెద్ద న్యూస్ అయిపోయింది. ఏదేమైనా కూడా.. ఈ రూమర్లన్నీ జస్ట్ రూమర్లే అనేది సన్నిహితుల టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News