బాహుబలి లాంటి భారీ బడ్జెట్ మూవీ.. సుదీర్ఘమైన ప్రాజెక్టు తర్వాత రాజమౌళి చేయబోయే సినిమాపై అంతటా ఆసక్తి నెలకొనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎన్టీఆర్.. రామ్ చరణ్ లతో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన నెక్ట్స్ ప్రాజెక్టుపై హింట్ ఇచ్చిన రాజమౌళి.. అసలు సంగతి మాత్రం ఇంకా చెప్పనేలేదు. కానీ ఇప్పటికే ఈ క్రేజీ మల్టీస్టారర్ పై అనేకానేక రూమర్స్ వచ్చేశాయి. వీటిలో ఏది సత్యం.. ఏది అసత్యం అని కనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు.
ఓ విషయాన్ని ఎంతగా దాచితే అంతగా క్లిక్ అవుతుందని.. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు' అనే పాయింట్ దగ్గరే ప్రూవ్ చేసిన దర్శక ధీరుడు.. ఇపుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఎన్టీఆర్-చెర్రీల కాంబినేషన్ లో మల్టీస్టారర్ ప్రాజెక్టుపై వస్తున్న కొత్త రూమర్ ఏంటంటే.. ఈ సినిమాలో వీళ్లిద్దరూ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు పోషిస్తున్నారని.. వీళ్లిద్దరూ ఓ గ్రామీణ ప్రాంతంలో సబ్ ఇన్ స్పెక్టర్ రోల్స్ చేస్తారని అంటున్నారు. విక్రమార్కుడు మూవీలో పోలీస్ పాత్రను ఎంతటి శక్తివంతంగా రాజమౌళి చూపించాడో చూశాం. మళ్లీ జక్కన్న సినిమాలో పోలీస్ అంటే బాగానే ఉంటుంది కానీ.. అసలు ఇంకా స్క్రిప్ట్ కూడా లాక్ కాలేదన్నది ఇన్ సైడ్ టాక్.
ఎన్టీఆర్-చెర్రీల కాంబినేషన్ లో మల్టీస్టారర్ మాట నిజమే అయినా.. ఇప్పటివరకూ ఒక్క స్టోరీ లైన్ మాత్రమే అనుకున్నారట. దీనికి తగినట్లుగా ఇంకా కథను డెవలప్ చేయాల్సి ఉందట. అందుకే అక్టోబర్ వరకూ టైం పెట్టుకున్నారట జక్కన్న అండ్ టీం. మరి అపుడే క్యారెక్టర్లు-ఉద్యోగాలు అంటే ఒట్టి రూమర్ మాత్రమే.