ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో కంచె వంటి హిట్ తర్వాత.. రాయబారి చిత్రాన్ని ప్రారంభించాలని భావించారు. క్యాస్టింగ్ సహా పలు ప్రీప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. అయితే, ఇప్పుడీ ప్రాజెక్టును ఆపేశారని తెలుస్తోంది. ఆపేయడమంటే.. తాత్కాలికంగా కాదు, కంప్లీట్ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసేసుకున్నారట.
రాయబారి షూటింగ్ ఈ పాటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ లొకేషన్స్ ఎంపిక, షూటింగ్ అనుమతులు వంటివి ఇంకా రాలేదు. వీటికి ఇంకా చాలా సమయం పట్టేట్లుగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో.. ఇక ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యి.. అదే విషయాన్ని క్రిష్ తో కూడా షేర్ చేసుకున్నాడట. స్క్రిప్ట్ వర్క్ కూడా ఇంకా పూర్తి కాకపోవడంతో.. క్రిష్ కూడా దీనికి సరే అన్నట్లు తెలుస్తోంది.
రాయబారి నిర్మాణం సాధ్యసాధ్యాలపై ఇద్దరూ చర్చించుకున్నాక, పోస్ట్ పోన్ కంటే అసలీ ప్రాజెక్ట్ కేన్సిల్ చేసుకోవడమే ఉత్తమం అని భావించారని తెలుస్తోంది. త్వరపడి స్టార్ట్ చేసేసి, రిస్క్ చేయడం కంటే.. మరో కొత్త కథతో కలిసి ప్రయాణించచ్చని నిర్ణయించుకున్నారని టాక్. త్వరలో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో, దిల్ రాజు నిర్మాణంలో ఓ మూవీని వరుణ్ తేజ్ స్టార్ట్ చేసేసే అవకాశాలున్నాయి.