మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసీఫర్’ ను తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా కాస్త ఆలస్యం అవ్వనుంది కాని సినిమా రీమేక్ మాత్రం ఖాయం అంటూ మెగా కాంపౌండ్ నుండి బలంగా టాక్ వినిపిస్తుంది. మొన్నటి వరకు సుజీత్ ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తాడనే టాక్ వచ్చింది. కాని ఇటీవల సుజీత్ స్థానంలో వినాయక్ పేరు వినిపిస్తుంది. సుజీత్ రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశాడని దాంతో ఆ ఛాన్స్ వినాయక్ కు వెళ్లిందనే ప్రచారం జరిగింది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
తాజాగా మరో అప్ డేట్ ఈ రీమేక్ గురించి వచ్చింది. లూసీఫర్ లో విలన్ పాత్రకు గాను వివేక్ ఒబేరాయ్ నటించాడు. తెలుగులో కూడా ఆయన్నే నటింపజేయాలని మొదట అనుకున్నారు. కాని అదే పాత్రను మళ్లీ చేసేందుకు వివేక్ ఆసక్తిగా లేడట. ఈ కారణంగానే పలువురు సీనియర్ నటులను పరిశీలించారని చివరకు సంజయ్ దత్ ను ఈ చిత్రంలో నటింపజేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
విలన్ పాత్రలపై ఎక్కువగా సంజయ్ దత్ ఆసక్తి చూపిస్తున్న కారణంగా ఖచ్చితంగా తెలుగు లూసీఫర్ లో కూడా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆచార్య చిత్రం పూర్తి అయిన తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో ఈ రీమేక్ ను పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అప్పటి వరకు సంజయ్ దత్ డేట్లు ఖాళీగా ఉంటే ఆయనే ఫస్ట్ ఛాయిస్ అవ్వొచ్చు అంటున్నారు.