నాన్నకు అంత లెంగ్తీ ప్రేమా?

Update: 2016-01-05 04:25 GMT
నాన్నకు ప్రేమతో చిత్రంలో ఏ జోనర్ మూవీ? ఇలా అడగడం సింపుల్ గానీ, ఆన్సర్ చాలా కష్టం. ఎందుకంటే.. ఫాదర్ సెంటిమెంట్ - ఎమోషన్స్ - బిజినెస్ మైండ్ గేమ్ - ఓ లవ్ స్టోరీ - వీటితోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్.. ఇన్నింటినీ మిక్స్ చేశాక ఒకటే జోనర్ కి కట్టేయడం కుదరని విషయం. మరి ఇన్ని వేరియేషన్స్ కలిపిన మూవీ ఎంత లెంగ్త్ ఉంటుందనే ప్రశ్న సహజం.

మీరనుకుంటున్నది నిజమే. వీటన్నిటినీ సమపాళ్లలో కలిపిన డైరెక్టర్ సుకుమార్.. చాలా పెద్ద సినిమానే తీశాడు. నాన్నకు ప్రేమతో చిత్రం రన్ టైం 3 గంటల 40 నిమిషాలు ఉంటుందట. ఈ మధ్య కాలంలో తీసిన అతి పేద్ద సినిమా ఇదే అంటున్నారు. అయితే.. ఇప్పుడు ఇంత పెద్ద మూవీని రిసీవ్ చేసుకోవడం కష్టం అనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఈ చిత్రం లెంగ్త్ ని బాగా తగ్గించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. 2 గంటల 20 నిమిషాలకు నిడివి తగ్గించాలని భావిస్తున్నారు మేకర్స్.

అయితే.. లెంగ్త్ తగ్గినా స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోడు సుకుమార్. మరోవైపు ఎన్టీఆర్ కూడా స్క్రీన్ ప్లే యథాతథంగా ఉండాలని అనుకుంటున్నాడు. అందుకే లాగ్స్ వరకూ తీసేసి, ఈ రివెంజ్ గేమ్ ని జనాల ముందుకు తీసుకు రానున్నారు. మొత్తానికి ఫైనల్ చేసిన వెర్షన్ ను ఈ నెల 8న సెన్సార్ చేయించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ థియేటర్లలో ఉంటాడనే విషయం.. లేటెస్ట్ అప్ డేట్ తో మరోసారి ప్రూవ్ అవుతోంది.
Tags:    

Similar News