డ్రైవర్ రాముడి జోడిగా ఆరెక్స్ బ్యూటీ

Update: 2018-11-25 06:01 GMT
ఆరెక్స్ 100లో కామంతో రగిలిపోయే ఇందూ పాత్రతో యూత్ మనసులు గెలుచుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత కొత్త సినిమాలు ఒప్పుకునే విషయంలో తొందరపడటం లేదు. ఆచి తూచి కథలను కాచి వడబోస్తోంది. ఆ మధ్య సి కళ్యాణ్ నిర్మాతగా లేడీ ఓరియెంటెడ్ మూవీ ఒకటి చేస్తుందనే టాక్ వచ్చింది కాని అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు పాయల్ రాజ్ పుత్ ఎన్టీఆర్ కథానాయకుడులో ఒక స్పెషల్ క్యామియోకు సైన్ చేసినట్టు తెలిసింది. ఆ పాత్ర ఎవరిదో కాదు సహజనటి జయసుధది.

ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్ అనగానే వెంటనే గుర్తొచ్చే సినిమా డ్రైవర్ రాముడు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యుగంధర్-అనురాగ దేవత-కేడి నెంబర్ వన్-లాయర్ విశ్వనాధ్-రామకృష్ణులు లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో ఈ కాంబో రిపీట్ అవ్వడమే కాదు మాస్ తో విజిల్స్ వేయించింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు నటించిన ఆఖరి చిత్రం నా దేశంలో కూడా జయసుధే హీరోయిన్. ఆయన రాజకీయ జీవితం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాక చేసిన శ్రీనాధ కవిసార్వభౌమలో ఈవిడే నటించారు.

ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న అతి కొద్ది కథానాయికల్లో జయసుధ గారిది ప్రత్యేక స్థానం. అందుకే దర్శకుడు క్రిష్ కొంత కాలం వెయిట్ చేసి మరీ పాయల్ తో ఓకే చేయించుకున్నట్టు సమాచారం. పాయల్ తో పాటు ఇతర హీరోయిన్లు ఎందరో క్యామియోల్లో నటిస్తున్న ఎన్టీఆర్ తనకు మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకంతో ఉందీ భామ. జనవరి 9న విడుదల కాబోయే కథానాయకుడులోనే పాయల్ పాత్ర ఉండబోతోంది. కీలకమైన సన్నివేశాలతో పాటు రెండు సాంగ్ బిట్స్ కూడా ఉంటాయని టాక్. మొత్తానికి పాయల్ మంచి ఛాన్సే కొట్టేసింది
Tags:    

Similar News