'సాహో' బయ్యర్స్ వాస్తవ సన్నివేశం?
ప్రభాస్ నటించిన మోస్ట్ స్టైలిష్ స్పై థ్రిల్లర్ `సాహో` తొలి నాలుగు రోజులు చక్కని వసూళ్లు రాబట్టినా.. ఐదో రోజు నుంచి పరిస్థితేంటి? అన్న రివ్యూ బయ్యర్లలో సాగుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టినా.. కొన్ని రికార్డుల్ని బద్దలు కొట్టినా.. ఏరియాల రైట్స్ కోసం కోట్లలో కుమ్మరించి సినిమాని కొన్నబయ్యర్స్ లో మాత్రం ఇంకా భయం వెంటాడుతూనే వుంది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పటి వరకు 210 కోట్లు షేర్ వసూలు చేసిందని లెక్కలు చెబుతున్నా బ్రేక్ ఈవెన్ కాకపోవడంతో బయ్యర్స్ లో టెన్షన్ ఉందని విశ్లేషిస్తున్నారు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి మూడింట రెండొంతులు కూడా వసూలు కాలేదని తెలుస్తోంది.
అయితే సాహో వసూళ్ల పై ప్రచారార్భాటం చూస్తే ఇప్పటికే లాభాల బాట పట్టిందన్న కన్ఫ్యూజన్ కామన్ జనాల్లో నెలకొంది. వాస్తవంగా ఇంకో 100-110 కోట్ల షేర్ సాధిస్తే తప్ప బయ్యర్స్ బయటపడని పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీంతో `సాహో` బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా ఎంత కాలం వేచి చూడాలి అన్న చర్చా సాగుతోంది. నాలుగు వెర్షన్లతో దాదాపు 10 కీలకమైన మార్కెట్లలో సాహో రిలీజైంది. ఒక్కోచోట ఒక్కో రిజల్ట్. ఒక్కో చోట థియేటర్ల నుంచి రిటర్నులు ఎలా ఉన్నాయి.. అన్నది లెక్కలు తీస్తుంటే చాలా నిజాలు తెలిసొస్తున్నాయట.
తెలుగు- తమిళ- మలయాళ భాషల్ని మినహాయిస్తే హిందీ వెర్షన్ మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. దీంతో బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్ ఊపిరి పీల్చుకున్నారట. హిందీ వెర్షన్ ని 65 కోట్లకు అమ్మారు. ఐదు రోజుల్లోనే హిందీలో 100 కోట్లు గ్రాస్ .. 60 కోట్ల షేర్ ను అధిగమించేయడంతో బయ్యర్స్ హ్యాపీగా వున్నారు. ఇదిలా వుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకు మించి పెట్టుబడిని పెట్టారు. ఆ మొత్తం వెనక్కి వస్తుందా? అంటే పూర్తిగా సందిగ్ధమేనని విశ్లేషణ సాగుతోంది. ఇక తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో మాత్రం బయ్యర్లకు `సాహో` కలెక్షన్స్ ఆశించినంత మెరుగ్గా లేవని చెబుతున్నారు. ప్రచారార్భాటం చేసినంత మాత్రాన ఐదో రోజు నుంచి అసలు టెస్ట్ మొదలవ్వడం థియేటర్లలో 50శాతం పైగా ఆక్యుపెన్సీ పడిపోవడంతో ప్రస్తుతం బయ్యర్లలో ఆందోళన గురించి చర్చ సాగుతోంది.