టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యాక్టర్లు.. నిర్మాతలు.. డైరెక్టర్లు అందరూ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు బ్యాచిలర్ లైఫ్ ని పెళ్లి చేసుకొని ఫిల్ చేద్దామని అనుకుంటున్నారు. మొదటగా బడా నిర్మాత దిల్ రాజు పెళ్లితో ప్రారంభం అయిన ఈ పెళ్లిళ్ల సీజన్ హీరో నిఖిల్.. కమెడియన్ మహేష్ తో పాటు తాజాగా అదేబాటలో అడుగులు వేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. గత కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సుజీత్.. ఆమె మెడలో మూడు ముళ్ళేసేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే జూన్ 10న సుజీత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో సుజీత్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి ప్రవల్లిక వృత్తిరీత్యా డెంటిస్ట్ అని సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి 'రన్ రాజా రన్' సినిమాతో పరిచయమైన డైరెక్టర్ సుజీత్.. ఆ తర్వాత తన రెండవ మూవీనే ఏకంగా డార్లింగ్ ప్రభాస్తో పాన్ ఇండియా మూవీ 'సాహో' రూపొందించి ఒక్కసారిగా స్టార్ అనిపించుకున్నాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా సుజీత్ కి మాత్రం మంచి పేరు తెచ్చింది. అయితే ప్రస్తుతం సుజీత్ మెగాస్టార్ చిరంజీవి అప్కమింగ్ మూవీ 'లూసిఫర్' రీమేక్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ లూసిఫర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడట ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఓ పక్క పెళ్ళికి కూడా సిద్ధం అయ్యాడు. సుజీత్ పెళ్లి మెగాస్టార్ తో లూసిఫర్ ప్రారంభం కాకముందే జరగనుందని సమాచారం. అయితే ఎప్పుడు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అంతేగాక అతి తక్కువ మందితో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తుంది. మొత్తానికి నిర్మాతలు.. హీరోలు.. డైరెక్టర్లు పెళ్లి పీటలు ఎక్కడం ఆనందమే అంటున్నారు సినీ ప్రియులు.