రెండు రోజుల క్రితం ఆగస్ట్ 15 నుంచి సాహో విడుదల పడిందన్న వార్తతో కంటి మీద కునుకుకు దూరమైన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తూ యువి సంస్థ అఫీషియల్ గా కొత్త డేట్ ప్రకటించింది. నాణ్యతలో రాజీ పడకపోవడం వల్లే ఇబ్బందిగా అనిపిస్తున్నా రెండు వారాలు వాయిదా వేయక తప్పలేదని ఆగస్ట్ 30 ని కొత్త డేట్ గా అధికారికంగా చెప్పేసింది. ఇక సంస్థ ఇచ్చిన నోట్ లో ఇలా ఉంది.
"బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ వెండితెరపైకి వస్తున్న సాహో ఈ ఏడాదిలోనే అత్యంత వెయిటింగ్ లో ఉన్న మూవీగా మీ ముందుకు రాబోతోంది. ముందు అనుకున్న ప్రకారం ఆగస్ట్ 15 రాలేకపోయినా కనివిని ఎరుగని యాక్షన్ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచే ఎపిసోడ్స్ ఉన్న ఈ మూవీకి రాజీ పడకూడదు అనే ఉద్దేశంతోనే తేదీని మార్చడం జరిగింది. స్వతంత్ర దినోత్సవం నాడు రాలేకపోతున్నా అదే నెలలో రావడం ద్వారా సాహో కమిట్ మెంట్ ని కొంచెం ఆలస్యం చేశాం అంతే. భారతీయ తెరమీద అతి పెద్ద యాక్షన్ మూవీని మీకు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం"
ఇదండీ యువి సంస్థ అఫీషియల్ నోట్. ఇంత స్పష్టంగా చెప్పేశారు కాబట్టి ఇంకే అనుమానం అక్కర్లేదు. సో ఇప్పటి నుంచి లెక్క వేసుకుంటే 40 రోజుల సమయం చేతిలో ఉంది. ఆడియో పూర్తిగా రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికి ఒక ట్రాక్ మాత్రమే వచ్చింది. ట్రైలర్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ల తాలూకు ప్లానింగ్ కూడా అంతర్గతంగా జరుగుతున్నట్టు తెలిసింది. వాయిదా కేవలం రెండు వారాలు కాబట్టి ఫ్యాన్స్ పెద్దగా ఫీలయ్యే ఛాన్స్ లేనట్టే.
రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న సాహోలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా జాకీ ష్రాఫ్ - నీల్ నితీష్ - మందిరా బేడీ - మహేష్ మంజ్రేకర్ - మురళి శర్మ - వెన్నెల కిషోర్ - అరుణ్ విజయ్ - చుంకీ పాండే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సో అభిమానులు ఇక రిలాక్స్ అయిపోయి 40 డేస్ కౌంట్ డౌన్ మొదలుపెట్టుకోవడమే బాకీ