ఓవైపు `సాహో` ఐమ్యాక్స్ రిలీజ్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. భారతదేశంలో ఉన్న అన్ని ఐమ్యాక్స్ థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోంది. అలాగే ఓవర్సీస్ లోనూ ఐమ్యాక్స్ ఫార్మాట్ రిలీజ్ కోసం అత్యంత ప్రణాళికా బద్ధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇండియాతో పోలిస్తే చైనాలో థియేటర్ల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఐమ్యాక్స్ థియేటర్లు అంతే పెద్ద స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మనకంటే అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో వీఎఫ్ఎక్స్ బేస్డ్ 3డి సినిమాల వీక్షణ చైనాలో చాలా ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అధునాతన సాంకేతికతలో జపాన్- కొరియా దేశాల తర్వాత చైనా అసాధారణ స్థాయిలో ఎదగడంపైనా నిరంతరం డిబేట్ సాగుతూనే ఉంటుంది.
అదంతా సరే కానీ.. సూపర్ స్టార్ రజనీకాంత్ - కిలాడీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ తెరకెక్కించిన వీఎఫ్ ఎక్స్ 3డి వండర్ 2.0 చైనాలో ఏకంగా 40వేల థియేటర్లలో రిలీజవుతోందన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు తావిస్తోంది. భారతదేశంలో ఈ చిత్రం 29 నవంబర్ 2018న రిలీజైంది. చాలా గ్యాప్ తర్వాత చైనాలో రిలీజవుతోంది.
వాస్తవానికి చైనా రిలీజ్ కి 12 జూలై 2019 తేదీని లాక్ చేసినా అప్పట్లో రకరకాల సాంకేతిక కారణాలతో రిలీజ్ చేయలేకపోయారు. సెప్టెంబర్ కి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం 2.0 చైనాలో రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 6 రిలీజ్ తేదీని లాక్ చేశారు. ఆ మేరకు ఎమీజాక్సన్ పోస్టర్ పై రిలీజ్ తేదీని ముద్రించి రిలీజ్ చేశారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 2.0 ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం చైనా బాక్సాఫీస్ పైనా శంకర్ - లైకా బృందం ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. 2.0 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10,500 థియేటర్లలో రిలీజ్ చేసారు. కానీ ఇప్పుడు చైనాలో దాదాపు నాలుగు రెట్లు అధికంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారంటే ఏ స్థాయి వసూళ్లు సాధించనుంది? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. చైనాలో దంగల్- సీక్రెట్ సూపర్ స్టార్- భజరంగి భాయిజాన్- హిందీ మీడియం- అంధాధున్ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. 2.0 చిత్రం అక్కడ ఆడియెన్ కి ఏమేరకు కనెక్టవుతుంది అన్నది వేచి చూడాలి.