దానవీరశూరకర్ణ వాళ్ళు తీసేశారు

Update: 2019-07-06 06:58 GMT
టాలీవుడ్ చరిత్రలో దివంగత ఎన్టీఆర్ దానవీర శురకర్ణది ప్రత్యేక స్థానం. అప్పట్లో పదేళ్ళ తర్వాత సెకండ్ రిలీజ్ చేసినా కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా ఇప్పటికీ రికార్డు పదిలంగా ఉంది. అయితే దీని రీమేక్ చేసే సాహసం ఎవరు చేయలేకపోయారు. మహాభారత గాధను తెరపై చూపాలని ఉందని జూనియర్ ఎన్టీఆర్ ని ప్రధాన పాత్రలో తీయాలని రాజమౌళి ఓసారి అన్నట్టు మీడియాలో వచ్చింది. ఇదే ఆకాంక్ష వివి వినాయక్ అంతకు ముందే వ్యక్తపరిచాడు.

ఇది కేవలం ఆలోచన దశలోనే ఆగిపోయింది తప్ప అంతకన్నా ముందుకు వెళ్లలేకపోయింది. మహాభారతంలోని మెయిన్ విలన్ గా భావించే దుర్యోధనుడిని హీరోగా చూపడం అందులోనే సాధ్యమయ్యింది. ఇక్కడ రీమేక్ సాధ్యపడలేదు కానీ కన్నడలో మాత్రం తీసేశారు. కెజిఎఫ్ ని మించే బడ్జెట్ తో మల్టీ స్టారర్ గా రూపొందిన కురుక్షేత్ర విడుదలకు రెడీ అవుతోంది. సుయోధనుడి పాత్రలో స్టార్ హీరో దర్శన్ కనిపించనున్నాడు. ఇప్పటికే టీజర్ ఒక ఆడియో సింగల్ ఆన్ లైన్ లో వదిలారు.

నాగన్న దర్శకత్వం వహిస్తున్న కురుక్షేత్రకు రచన జెకె భారవి. ఈయన నాగార్జున అన్నమయ్య-శ్రీరామదాసు చిరంజీవి శ్రీ మంజునాథ లాంటి భక్తి రస చిత్రాలకు పని చేసిన రచయిత. ఇప్పుడీ మల్టీ స్టారర్ కు కూడా కలం అందిస్తున్నారు. దీన్ని తెలుగులో డబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ లెక్కలు బయటికి చెప్పడం లేదు కానీ 150 కోట్లకు పైగా అయ్యిందని ఇన్ సైడ్ టాక్. ఇక్కడ ఎలాగూ ఆలస్యం అవుతోంది కానీ అప్పటిలోగా ఈ కురుక్షేత్రతో సర్దుకోవాల్సిందే. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది


Tags:    

Similar News