టాలీవుడ్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అన్న ప్రచారం ఉంది. ఇక్కడ హీరోలు దర్శకులు ఏం చెబితే అదే సాగుతుంది. సిస్టమ్ ని గుప్పిట పట్టి తమ అదుపులో ఉంచుకుంటారు. పారితోషికంలో కానీ కథానాయికల ఎంపిక విషయంలో కానీ నిర్మాతకు కానీ లేదా ఇతరులకు కానీ అంత ప్రాధాన్యత ఉండదని చెబుతారు.
ఇకపోతే ఇటీవల కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఈ డామినేషన్ మరింత పెరిగిందే కానీ తగ్గలేదట. అంతేనా.. ఇప్పుడు ఫలానా హీరోయిన్ కి ఎంత పారితోషికం ఇవ్వాలో కూడా వీళ్లే డిసైడ్ చేసేస్తున్నారట. బడ్జెట్ అదుపు లో ఉండాలంటే తమ పారితోషికాలు తగ్గించుకోరు కానీ హీరోయిన్ల విషయంలో తగ్గించాలనేది కండీషన్ అని తెలిసింది. దీంతో నిర్మాతలు చేసేదేమీ లేక హీరోయిన్లను బలి పశువుల్ని చేస్తున్నారు. హీరోలు దర్శకులు చివరికి సంగీత దర్శకుల పారితోషికాలు పెరుగుతున్నాయి కానీ హీరోయిన్లకు మాత్రం లక్షల్లో కోత పడిపోతోందట. 15ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న ఓ అగ్ర కథానాయికకు 15లక్షలు కోసేసారట. తగ్గింపుతోనే ఆవిడ సర్ధుకుంటోంది. అలాగే ఒకే హీరోతో వరుసగా రెండు సినిమాలకు ఒప్పించేందుకు ఏకంగా 75లక్షల నుంచి 50లక్షలకు వేరొక బ్యూటీకి పారితోషికం కుదించారట. రెండు వరుస ఫ్లాపుల్లో నటించిన వేరొక బ్యూటీని 40లక్షలకే దించేశారట. ఇలాంటి కథలు కథనాలు ఇండస్ట్రీలో బోలెడన్ని వినిపిస్తున్నాయి.
పాపం హీరోయిన్లకు కరోనా ఎసరు పెట్టింది అంటూ గుసగుసలు వేడెక్కించేస్తున్నాయి. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే. అందుకే దీపం ఉండగానే చక్కదిద్దుకునేందుకు కొందరు కథానాయికలు వస్తూనే హిట్టు కొట్టాక పారితోషికాలు అమాంతం పెంచేస్తుంటారు. అయితే ఎంత డామినేషన్ ఉన్నా కానీ సమంత.. పూజా.. రష్మిక లాంటి నాయికలు మాత్రం అడిగినంతా ఇవ్వాల్సిందేనట. ఇక్కడ డిమాండ్ సప్లయ్ సూత్రానికి సక్సెస్ ని అన్వయిస్తున్నారు.