అక్కినేని నాగార్జునకు డిసెంబరు నెలంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. నాగ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైన మాస్ - మన్మథుడు ఈ నెల్లోనే సందడి చేశాయి. రగడ కూడా ఈ నెల్లోనే విడుదలై కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అందుకే తన డిసెంబరు ఆయనకు సెంటిమెంటుగా మారింది. ఇప్పుడు తన కొత్త సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ను కూడా డిసెంబర్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు నాగ్. ముందుగా అనుకున్న ప్రకారమైతే ఈ సినిమా రెండు నెలల ముందే విడుదల కావాల్సింది. కానీ రీషూట్ల వల్ల ఆలస్యమై.. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆలస్యమైతే అయ్యింది.. అంతా మన మంచికే అన్నట్లు తనకు అచ్చొచ్చిన డిసెంబరు నెలలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నాగ్.
ఐతే ఇక్కడే నాగ్ కు ఓ చిక్కొచ్చి పడింది. అతడి పెద్ద కొడుకు నాగచైతన్య కొత్త సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ కూడా డిసెంబరుకే షెడ్యూలైంది. ముందు ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ దీని తమిళ వెర్షన్ కొంచెం ఆలస్యం కావడం.. దీపావళికే ‘అఖిల్’ విడుదల చేయాలనుకుంటుండటంతో డిసెంబరుకు వాయిదా వేశారు. కాబట్టి తండ్రీ కొడుకుల సినిమాలు ఒకే నెల్లో పోటీ పడటం ఖాయం. కాకపోతే రెంటి మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి వారంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’.. మూడు లేదా నాలుగో వారంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ విడుదలయ్యే అవకాశాలున్నాయి.