2019 మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నేటికి సరిగ్గా 69 రోజులే మిగిలి ఉంది ఇంకా. అంతకంతకు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రభాస్ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ పెరుగుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు- ట్రైలర్ - ప్రీరిలీజ్ ఈవెంట్ కి సాహో టీమ్ భారీగానే ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. వారం రోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో సాహో షూటింగ్ జరుగుతోంది. నేటితో టాకీ చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. ఈనెల 9 నుంచి అన్నపూర్ణ లో సాంగ్ షూట్ పూర్తి చేయనున్నారు. ఇండోర్ లో పాట చిత్రీకరణ కోసం ఇప్పటికే భారీ సెట్లు వేశారు. ఈ పాట చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయినట్టే. అంటే ఇక కీలకమైన డబ్బింగ్ సహా డీఐ పనులు చేస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ - వీఎఫ్ ఎక్స్- మిక్సింగ్ కి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతున్నాయి. సైమల్టేనియస్ గానే ఎడిటింగ్ పనులు పూర్తవుతున్నాయి.
తదుపరి టీమ్ ప్రచారంపైనే పూర్తిగా దృష్టి సారించనుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ సాహో చిత్రానికి సంబంధించిన ప్రచారం వేరు. ఇకపై చేయబోయే ప్రచారం వేరు. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో వీలున్న ప్రతి వేదికపైనా ప్రచారం చేసేందుకు సుజీత్ -యువి బృందం ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇకపై ఒక్కో పోస్టర్ .. టీజర్ వేడి పెంచుతాయని తెలుస్తోంది. సాహో చిత్రాన్ని కేవలం ఇండియాలోనే కాదు.. చైనా- జపాన్ -అమెరికా- బ్రిటన్- మలేషియా- సింగపూర్ తదితర లొకేషన్లలోనూ భారీగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ ఉంది. ఆ మేరకు ప్రీ ప్రణాళికల్ని రూపొందిస్తున్నారట.