తెలివైనోడితో వినాయక్ కు కష్టాలు

Update: 2018-01-04 06:22 GMT
మాస్ దర్శకుడు వివి వినాయక్.. ప్రస్తుతం సాయి ధరం తేజ్ తో ఓ మూవీ చేస్తున్నాడు. వచ్చే నెల 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. బ్యాలెన్స్ షూట్ ను మరో వారంలో పూర్తి చేసేందుకు మహా కసిగా వర్క్ చేసేస్తున్నారు.

ఇంటెలిజెంట్ అనే టైటిల్ ను ఈ చిత్రానికి ఖాయం చేసుకున్నారని.. దర్శకుడు వినాయక్ ఈ పేరుకే స్టిక్ అయ్యాడని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మస్కట్ లో ఉన్న ఈ ఇంటెలిజెంట్.. వినాయక్ ని తెగ కష్టపెట్టేస్తున్నాడు. అద్భుతమైన లొకేషన్స్ లో పాటను చిత్రీకరించేందుకు నిర్ణయించగా.. ఓ షూటింగ్ స్పాట్ కు చేరుకోవడానికి తెగ కష్టపడాల్సి వస్తోందట. మస్కట్ లో ఉన్న ఓ సూపర్బ్ లొకేషన్ కు చేరుకునేందుకు.. రోజూ ఉదయాన్నే 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేస్తున్నారట. దర్శకుడు వినాయక్ తో సహా 20 మంది టీం మెంబర్స్ ఈ స్పాట్ కు చేరుకుని షూట్ చేసినట్లు తెలుస్తోంది.

24 గంటల షూటింగ్ హవర్స్ లో ఈ పాట చిత్రీకరణ పూర్తి చేయగా.. మొదటగా ఈ లొకేషన్ లో తమిళ్ హీరో విశాల్ షూట్ చేశాడు. తెలుగులో ఈ లొకేషన్ ను ఆన్ స్క్రీన్ పైకి తెస్తున్న తొలి చిత్రం ఇంటెలిజెంట్. తన సినిమాలలో రెగ్యులర్ గా మాస్ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే వినాయక్.. ఇంటెలిజెంట్ విషయానికి వచ్చేసరికి.. ఆ డోస్ ను కాస్త తగ్గించాడని అంటున్నారు. మాగ్జిమమ్ ఇంటెలిజెన్స్ తోనే సమస్యలను అధిగమించే పాత్రలో తేజు యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు యూనిట్.
Tags:    

Similar News