పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ధాతృత్వం .. సాయం చేసే గుణం గురించి అభిమానులు ఎక్కువగా ముచ్చటిస్తుంటారు. ఆపదలో ఉన్న వారిని పవన్ ఎన్నోసార్లు ఆదుకున్న సందర్భాలున్నాయి. ఆయన మేనల్లుడిగా సాయి తేజ్ సైతం మామ బాటలోనే పదిమందికి సాయం చేస్తూ వార్తల్లోకొస్తున్నారు. మంచి మనసున్న మారాజు అని మెగా మేనల్లుడు సాయిధరమ్ నిరూపించుకుంటున్నాడు. ఇదివరకూ ఓ ఫిలిం జర్నలిస్ట్ ఆపదలో ఉంటే లక్షల్లో సాయం అందించిన సాయిధరమ్ అభిమానుల విషయంలోనూ కష్టంలో అలానే స్పందించి ఆర్థిక సాయం చేశారు.
ఆ ధాతృత్వం అక్కడితో ఆగిపోలేదు. తాజాగా కొందరు వికలాంగులైన (ఫిజికల్లీ హ్యాండికేప్డ్) చిన్నారులు తమకు అవెంజర్స్ - ఎండ్ గేమ్ చూడాలని ఉందంటూ సాయిధరమ్ ని సంప్రదించారట. అంతే ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఆ పిల్లలందరికీ మే 1న దగ్గరలోని థియేటర్ లో స్పెషల్ షో ఏర్పాటు చేయించారట. అందుకు అవసరమయ్యే టిక్కెట్ల ఖర్చు అంతా సాయిధరమ్ భరిస్తున్నారు. సాయిధరమ్ దయార్థ హృదయానికి ఆ కిడ్స్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా `అవెంజర్స్ - ఎండ్ గేమ్` మానియా గురించి తెలిసిందే. ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సాధించడానికి కారణం పిల్లలు సహా యూత్ పెద్దలు థియేటర్లకు వెళ్లడమే. ఈ సమ్మర్ సెలవుల్లో చిన్నారులు `అవెంజర్స్ 4- 3డి `ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి టెక్నికల్ వండర్ ని చూసేందుకు వెళతామని మారాం చేస్తే పేరెంట్ సైతం పిల్లలకు అభ్య ంతరం చెప్పడం లేదట. మొత్తానికి అవెంజర్స్ ఫీవర్ కిడ్స్ లో ఓ రేంజులో ఉందని ప్రత్యక్షంగా ఐమ్యాక్స్- ఇనార్బిట్ లాంటి చోట్ల చూస్తే సీన్ అర్థమవుతోంది. ఇక అంగ వైకల్యం ఉన్న చిన్నారుల కోసం ఇదివరకూ స్పైడర్ మేన్ చిత్రాన్ని నమ్రత శిరోద్కర్ - ఏఎంబీ సినిమాస్ లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.