కొంచెం స్టార్ ఇమేజ్ ఉన్న హీరో.. ఒక పెద్ద దర్శకుడు కలిసి సినిమా చేసినపుడు దానికి టాక్ ఎలా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వస్తుంటాయి. కానీ ‘ఇంటిలిజెంట్’ విషయంలో అలా జరగలేదు. సాయిధరమ్ తేజ్ లాంటి కొంచెం మార్కెట్ ఉన్న హీరో.. వి.వి.వినాయక్ లాంటి పెద్ద దర్శకుడితో కలిసినా ఈ చిత్రానికి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. రూ.2.5 కోట్ల లోపు తొలి రోజు షేర్ రాబట్టిందీ చిత్రం. పోయినేడాది ఇదే టైంలో రిలీజైన ‘విన్నర్’కు నెగెటివ్ టాక్ వచ్చినా రూ.5 కోట్లకు పైగా ఫస్ట్ డే షేర్ తెచ్చింది. దీన్ని బట్టి తేజు మార్కెట్ ఎంతగా డ్యామేజ్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. తొలి రోజు తొలి షోతోనే దీని జాతకమేంటో తేలిపోయింది.
ఇక ఆ ఆ తర్వాత ఏ దశలోనూ ‘ఇంటిలిజెంట్’ పుంజుకోలేదు. ఫస్ట్ వీక్ షేర్ రూ.5 కోట్లు కూడా రాలేదని సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని నిర్మాత రూ.25 కోట్లకు అమ్మగలిగాడట. పబ్లిసిటీ ఇతర ఖర్చులు కలుపుకుంటే ‘ఇంటిలిజెంట్’ రూ.27 కోట్ల దాకా వెనక్కి తేవాలట. కానీ ఈ సినిమా ఫుల్ రన్లో రూ.10 కోట్ల షేర్ మార్కును అందుకోవడం కూడా కష్టంగానే ఉంది. రాబట్టాల్సిన దాంట్లో 25 శాతానికి మించి తెచ్చే అవకాశం లేదంటున్నారు ట్రేడ్ పండిట్లు. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు ఇప్పటికే అమ్మారో లేదో తెలియదు. అమ్మకుంటే మాత్రం చాలా కష్టమే. కాస్త పేరున్న సినిమాల్లో ఈ ఏడాదికి ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యేలా ఉంది పరిస్థితి.