టాలీవుడ్ లో టాప్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సక్సెస్ రేట్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక సినిమా బిజినెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో ఆయన ఆయనే సాటి. దాదాపు అన్ని ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులకు దిల్ రాజు గురించి తెలుసు. అయన ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఎప్పుడు మంచి సినిమాలు వస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ దర్శకుల్లో కొంతమందిని దిల్ రాజే పరిచయం చేశారు.
ఇకపోతే ఈ ఏడాది వరుసగా విజయాలను అందుకొని అన్ని సినిమాల బిజినెస్ లను లాభాల్లో నడిపించిన దిల్ రాజు జవాన్ సినిమా బిజినెస్ లో మాత్రం చాలా ఫెయిల్ అయ్యాడనే టాక్ వస్తోంది. ఈ సినిమా మొదటి వారం డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది. కానీ పెద్దగా లాభాలు వచ్చే మ్యాటర్ అయితే ఏమి లేదు. ఇకపోతే సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం ఇంకా అమ్ముడు పోలేదు. అసలైతే సినిమా విడుదలకు ముందే అమ్మెయ్యాలని అనుకున్నారు. కానీ సినిమాపై చాలా నెగిటివ్ టాక్స్ వచ్చాయి.
ఆలస్యం కావడంతో మొదట సినిమాను రీ షూట్ చేశారని పలు వెబ్ సైట్స్ లలో ప్రచారం బాగా సాగింది. ఇక రివ్యూలు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ లో ప్రీమియర్ షో వేసి హైప్ తీసుకురావాలని అనుకున్నారు. కానీ క్రిటిక్స్ కూడా ఏ మాత్రం పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. రిలీజ్ తర్వాత కూడా సినిమాకు పాజిటివ్ టాక్ ఏమి రాలేదు. దీంతో ఛానెల్స్ ఎక్కువ రేటుతో జవాన్ ను కొనడానికి ముందుకు రావడం లేదట.