టీజర్ టాక్‌: దేశభక్తంటే కిరీటం కాదు

Update: 2017-07-31 11:38 GMT
''కొంతమంది మనుషులు కలిస్తే కటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశం అంటే కిరీటం కాదు. కృతజ్ఞత'' అనే లైన్ తో బాగానే ఆకట్టుకున్నాడు రచయిత-దర్శకుడు బివిఎస్ రవి. ఇంతకీ ఈ లైన్లు ఎక్కడివి బాబు అనేగా మీ ప్రశ్న.. అయితే ఇవన్నీ కూడా ఆగస్టు 1న రిలీజ్ కు సిద్దంగా ఉన్న ''జవాన్'' సినిమాలోని. ఇంటికొక్క జవాన్ అంటూ వస్తున్న ఈ సినిమా టీజర్ (అదేలే ప్రిల్యూడ్ అంటున్నారు) ఈరోజే రిలీజైంది.

అసలు మ్యాటర్ ఏంటో తెలియదు కాని.. ఒక యువకుడికి బీభత్సమైన దేశభక్తి ఉండటంతో అతను దేశం కోసం ఏం చేశాడు అనేదే ఇప్పుడు ఈ సినిమాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే.. ఏదో బర్నింగ్ టాపిక్ తీసుకుని సినిమాను తీశారనే అనుకోవాలి. అయితే తమిళ దర్శకుడు శంకర్ తరహాలో ఏదన్నా ప్రయోగం చేసుంటారేమో మరి. ఇకపోతే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఎప్పటిలాగా డ్యాన్సులు వేసేసి మెగా రిఫెరెన్సులతో హడల్ కొట్టేసి విపరీతంగా ఏమీ చేయకుండా.. చక్కగా క్యారక్టర్ కు తగినట్లు ఏదో ప్రయత్నించినట్లే ఉన్నాడు. అసలు గతంలో గోపిచంద్ తో 'వాంటెడ్' సినిమాను తీసిన బివిఎస్ రవి ఇప్పుడు ఇలాంటి సినిమా తీశాడంటే కాస్త కొత్తగానే ఉంది. చూద్దాం ఎంతవరకు ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో.

రవి డైరక్షన్లో సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ పీర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ అనుకుంటున్నారు కాని.. బాలయ్య 'పైసా వసూల్' కూడా అదే తేదీన రానుండటంతో.. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడొచ్చు అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో.


Full View
Tags:    

Similar News