'మెగా' ఫంక్షన్లలో పవర్ స్టార్ అంటూ అరవడం కొందరికి ఆనవాయితీయే. అలా చేయడం వలన జనాలకు విసుగు వచ్చేస్తోంది, అవమానించినట్లుంది అని ఎంత చెప్పినా కూడా ఈ గొంతుచించుకునే బ్యాచ్ మాత్రం మారట్లేదు. గత రాత్రి జరిగిన తిక్క ఆడియో ఫంక్షన్ లో కూడా అదే రిపీటైంది. మరి సాయిధరమ్ కూడ చెప్పను బ్రదర్ అంటాడేమో అనుకుంటే, అరుస్తాను బ్రదర్ అన్నాడు.
''మీరు అలా అరవమంటే ఎన్నిసార్లు అరవమన్నా అరుస్తూనే ఉంటాను. పవర్ స్టార్. మెగా స్టార్. మెగా పవర్ స్టార్. వాళ్లు లేకపోతే నేను ఈరోజున ఇక్కడ లేను'' అంటూ అరుస్తానుబ్రదర్ అనే నయా ట్యాగ్ ను వాడుకలోకి తీసుకొచ్చాడు సాయిధరమ్. ''చిరంజీవి గారు 30 ఏళ్ళు శ్రమించి మీ ప్రేమను పొందారు. కళ్యాణ్ గారు ఆయన దారిలో ఆయనేదో చేసి మీ ప్రేమను పొందారు. బన్నీ.. చరణ్.. ఇలా అందరం మీ ప్రేమను పొందడానికి బాగా కష్టపడుతున్నాం. కాని పెదమావయ్యకు చూపించినంత ప్రేమ మాక్కూడా చూపిస్తున్నారు. అందుకే ఈ ప్రేమకు భానిసలం అయిపోయాం. అభిమానం పీక్స్ లో అంటే అది కేవలం మెగా అభిమానులే చూపించగలుగుతారు'' అంటూ అటు తన ఫ్యామిలీని, ఇటు మెగా ఫ్యాన్సునూ ఆకాశానికి ఎత్తేశాడు తేజు.
మొత్తానికి 'చెప్పను బ్రదర్' అంటూ టీజ్ చేసి.. తరువాత అసలు విషయం ఒకరు చెబితే.. 'అరుస్తాను బ్రదర్' అంటూ ఇప్పుడు ఇంకో మెగా ఫ్యామిలీ హీరో కొత్త ఊపునిచ్చాడు.