నేనేం 90ML కొట్టేసి ఇక్కడికి రాలేదు: సాయితేజ్

Update: 2022-08-31 03:02 GMT
వైష్ణవ్ తేజ్ ఫస్టు టైమ్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్ మాదిరిగానే  కేతిక శర్మకి కూడా ఇది మూడో సినిమా.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయితేజ్ - వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా నిన్న రాత్రి హైదరాబాద్ - పార్క్ హయత్ హోటల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ స్టేజ్ పై సాయితేజ్ మాట్లాడుతూ .. " 2021 మాకు చాలా లక్కీ ఇయర్. వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో పరిచయమయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. వైష్ణవ్ ను మీరు హీరోగా అంగీకరించారు .. నిజంగా మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం అది. అందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. అలాంటి నా తమ్ముడు 'అన్నయ్య' అని పిలిస్తే నేను పలకలేకపోయాను. అప్పుడు నేను యాక్సిడెంట్ జరిగి బెడ్ పై ఉన్నాను.

మంచిగా ఉన్నప్పుడు అందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుందనేది నాకు అర్థమైంది. మన అనేవాళ్లు పక్కనే ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందనేది తెలిసింది. నాకు ప్రమాదం జరిగిన తరువాత నా తమ్ముడు నా పక్కనే ఉన్నాడు .. వాడు నా బలం.

ఈ  సినిమా హిట్ అవుతుందా ... బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది నాకు తెలియదుగానీ, నా తమ్ముడిని మీరు హీరోగా అంగీకరించారు .. అదే నాకు ఆనందం. వైష్ణవ్ తేజ్ ప్రతి సినిమాలోను రొమాన్స్ ను అదరగొట్టేస్తున్నాడు.

నా తమ్ముడు హ్యాపీగా ఉండటమే నాకు కావలసింది. నేనేం 90 ఎమ్మెల్ కొట్టేసి రాలేదు ... నాకు తాగడం అలవాటు లేదు. మనలో ఉండే ...మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. సెప్టెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ మాత్రమే కాదు .. అంతకంటే పెద్ద పండగ ఉంది. ఆయన మీకు పవర్ స్టార్ .. నాకు మాత్రం గురువుగారు. కనుక ఆ రోజున ఈ సినిమాను చూసి బర్త్ డే పార్టీ చేసుకోండి. చివరిగా నేను చెప్పేది ఒక్కటే .. అందరూ బైక్ నడుపుతుండగా హెల్మెట్ పెట్టుకోండి. అది ఉండటం వల్లనే నేను ఇంకా బ్రతికి ఉన్నాను" అంటూ సాయిటేజ్ ఎమోషనల్ అయ్యాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News