ఇప్పుడున్న హీరోయిన్లలో సాయి పల్లవి నటనలోనే కాదు మిగిలిన విషయాల్లో కూడా తన ప్రత్యేకత నిలుపుకుంటోంది. స్టార్ హీరోల సరసన ఆఫర్లు వస్తున్నా పెర్ఫార్మన్స్ కు అవకాశం ఉంటె తప్ప ఎస్ చెప్పని ఈ కేరళ కుట్టి కొత్త సినిమా ఎన్జికె ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్న సాయి పల్లవి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో సారి ఫెయిర్ నెస్ క్రీం యాడ్స్ ఎందుకు ఒప్పుకోవడం లేదన్న ప్రస్తావన వచ్చింది. దానికి సాయి పల్లవి ఇచ్చిన సమాధానం వింటే ఎంత మెచ్యూరిటీనో అర్థమవుతుంది. అదేంటో తన మాటల్లోనే
"నాకు ఫెయిర్ నెస్ యాడ్స్ లో నటించడం ససేమిరా ఇష్టం ఉండదు. కారణం చెబుతాను. నాకు తెలిసిన ప్రపంచం అమ్మానాన్న చెల్లి పూజా. తను నాకంటే కేవలం ఐదేళ్లు చిన్నది. కానీ అద్దంలో నా పక్కన నిలుచుని చూసినప్పుడంతా అక్కంత అందంగా లేనే అని ఫీలవుతూ ఉంటుంది. నేను చెప్పాను. పిజ్జా బర్గర్ లాంటి జంక్ ఫుడ్ తినడం మానేసి పళ్ళు కాయగూరలు మొదలుపెట్టమని. నాలా కావడం కోసం అలాగే అలవాటు చేసుకుంది. అంటే పోలిక అలవాటు మార్చే దాకా తీసుకెళ్లింది.
మనది దేవుడు ఇచ్చిన రంగు. దాన్ని క్రీములతో మార్చాలనుకోవడం సరికాదు. అయినా వాటితో వచ్చే డబ్బుతో నేనేమైనా రెండు చపాతీలు ఎక్కువ తింటానా. లేదు కదా. నా ఆకలి పెరగదు కదా. ఇంకెందుకు అబద్దాలు చెప్పే యాడ్స్ లో నటించడం. అమెరికా వెళ్లి మీరెందుకు మరీ ఇంత తెల్లగా ఉన్నారు అని అడగలేం కదా. దానికి రీజన్ వెతికితే క్యాన్సర్ మూలాలు దొరుకుతాయి. ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉండటం భౌగోళిక లక్షణం. అందులోనూ అందం ఉంది. అంతేతప్ప దాన్ని వికారం అనుకో కూడదు. ప్రేమమ్ లో నటించినప్పుడు మగాళ్లలా ఉండే నా గొంతు మొహం మీద మొటిమలు జనం చూస్తారా నా వల్లే సినిమా ఫ్లాప్ అవుతుందా అని దర్శకుడు ఆల్ఫోన్స్ ని అడిగేదాన్ని. కానీ మార్చుకునే ఉద్దేశం మాత్రం లేకపోయింది. అదే నా ఆత్మవిశ్వాసం. విజయ రహస్యం"
చూసారుగా. సాయి పల్లవికి అందం పట్ల ఉన్న దృక్పథం. ఈ స్వభావం వల్లే తెరమీద కూడా సహజమైన నటన చేస్తోంది కాబోలు. ఎన్జికెలో సూర్య భార్యగా నటిస్తున్న సాయి పల్లవికి ఇందులో కూడా పెర్ఫార్మన్స్ కు బోలెడు స్కోప్ దక్కింది. గ్లామర్ షోకు నో చెబుతూ కూడా స్టార్ హీరోల సరసన వరస బెట్టి అవకాశాలు రాబడుతున్న సాయి పల్లవి అవసరమైతే పస్తులు ఉంటాను కానీ రాజీ పడే సమస్యే లేదంటోంది.