శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించిన 'పడి పడి లేచే మనసు' డిసెంబర్ 21 రిలీజ్ అయింది. సినిమాకు హిట్ టాక్ రాలేదు కానీ శర్వానంద్ - సాయి పల్లవి ల మధ్య కెమిస్ట్రీ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరూ మంచి పెర్ఫార్మర్లు కావడంతో స్క్రీన్ మీద వారి బదులుగా ఆ పాత్రలే కనిపించాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు.
ఆ ఇంటర్వ్యూలో శర్వా గురించి అడిగినప్పుడు సాయిపల్లవి మాట్లాడుతూ "మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఎవరైనా అమ్మాయి కనిపిస్తే 'శర్వా నువ్వు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి' అని చెప్తాను అలాంటి ఫ్రెండ్ షిప్ ఉంది మామధ్య" అని చెప్పింది. ఇక టాపిక్ కంటిన్యూ చేస్తూ శర్వానంద్ "అవును.. ఎయిర్ పోర్ట్ లో ఒక ఫారెన్ అబ్బాయి కనిపిస్తే.. పల్లవి.. ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటావా.. నన్ను వాళ్ళతో మాట్లాడమంటావా అని అడిగాను" అని చెప్పాడు. "ఇక్కడోళ్ళు నీకు సెట్టవరు నీకు ఫారెన్ వాళ్ళే బెటర్" అని సాయిపల్లవి వైపు తిరిగి అన్నాడు.
దీనికి సాయి పల్లవి సమాధానం ఇస్తూ ఇంటర్వ్యూయర్ తో ఇలా చెప్పింది "ఆ ఫారెన్ అబ్బాయి పక్కనే ఒక అమ్మాయి ఉంది.. శర్వా మాత్రం తనతో పెళ్ళి ఫిక్స్ చేస్తానంటాడు. అదెలా?" దీనికి ఒక క్షణం కూడా ఆలోచించకుండా శర్వా "అయితే ఏంటి.. మీ ముగ్గురూ కలిసి ఉండొచ్చు" అన్నాడు. ఈ సమాధానంతో సాయి పల్లవి తో పాటుగా యాంకర్ కూడా షాక్ తిని నవ్వుల్లో మునిగిపోయింది. ఈ జోక్ ను చాలా స్పోర్టివ్ గా తీసుకున్న సాయి పల్లవి "ఇదిగో ఇలా మాట్లాడతాడు శర్వా. అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నేను చూడను.. ఎందుకంటే శర్వా నాకు మంచి ఫ్రెండ్" అని తన ఫ్రెండ్ ను వెనకేసుకొచ్చింది