ఇప్పటివరకూ తెలుగులో అతి తక్కువ సినిమాలు మాత్రమే చేసినా.. హీరోయిన్ సాయిపల్లవికి టాలీవడు్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. రీసెంట్ గా వచ్చిన కణం మూవీ అంతగా ఆకట్టుకోకపోయినా.. అంతకు ముందు ఈ భామ నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు. అందుకే ఈ చిన్నది నటించే చిత్రాలపై ఆసక్తి ఎక్కువగానే ఉంది.
ప్రస్తుతం 'పడి పడి లేచె మనసు' అంటూ ఓ సినిమా చేస్తోంది ఈ భామ. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ నటించిన ఈ సినిమాకు.. శర్వా బర్త్ డే సందర్భంగా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు హీరోయిన్ పోస్టర్ ను కూడా ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో బెంగాలీ స్టైల్ లో పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న సాయి పల్లవి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె చీర కట్టు చూస్తేనే.. ఈ పాత్రలో పల్లవి ఎంతగా ఒదిగిపోయిందో అర్ధం అవుతుంది.
మరోవైపు సాయి పల్లవి డ్యాన్స్ మూమెంట్ కి సంబంధించిన స్టిల్ కూడా సూపర్బ్ గా ఉంది. సహజంగానే మంచి డ్యాన్సర్ అయిన ఈమె.. అన్ని రకాల నృత్యాలలోను.. డ్యాన్స్ చేసే సమయంలో ఎమోషన్స్ ఇవ్వడంలోను బాగా ఆరితేరిపోయింది. పడిపడి లేచె మనసు చిత్రాన్ని మెజారిటీ భాగం కోల్కతా లోనే షూటింగ్ చేస్తున్నారు.