మూడేళ్ళ తరువాత సాయిపల్లవి సినిమా

Update: 2019-03-16 05:44 GMT
ఏ ముహూర్తంలో ఫిదా చేసిందో కాని సాయి పల్లవికి తన స్వంత బాషలో మలయాళం సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయింది. ఆఫర్లు లేక కాదు. తమిళ్ తెలుగులో ఇచ్చిన కమిట్ మెంట్స్ అన్నేసి ఉండటంతో సెలవుల్లో తప్ప కేరళకు వెళ్ళే ఛాన్స్ కూడా దొరకడం లేదు తనకు. ఆఖరిసారి సాయి పల్లవి మలయాళంలో చేసిన మూవీ కలి. అందులో దుల్కర్ సల్మాన్ హీరో. దాని తర్వాత వచ్చిందే ఫిదా.

మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ మల్లు వుడ్ బ్యూటీ అక్కడో సినిమా చేసింది. అదే అతిరన్. టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు ఉన్న ఫర్హాద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి వివేక్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ కీలక భాగం పూర్తయిపోయింది. ఓ సైకియాట్రిస్ట్ హాస్పిటల్ నేపధ్యంలో సాగే కథగా ఇది రూపొందినట్టు తెలిసింది. దీని పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సాయి పల్లవి మూడేళ్ళ తర్వాత మలయాళం మూవీ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది

ప్రస్తుతం తను సూర్యతో చేసిన ఎన్జికే కోసం ఎదురు చూస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు గత ఏడాది ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన పడి పడి లేచే మనసు డిజాస్టర్ కాగా మారి 2 తమిళ్ లో యావరేజ్ గా నిలిచి తెలుగు అసలు వచ్చిందా లేదా అనేంత ఫాస్ట్ గా మాయమైపోయింది.

అందుకే దీని మీదే తన హోప్స్ అన్ని. మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబో మూవీ వద్దని చెప్పిందన్న వార్తలు ఇటీవలే కాస్త గట్టిగానే షికారు చేశాయి. దాని గురించి సాయి పల్లవి ఇంకా నేరుగా స్పందించలేదు. ఇప్పుడీ అతిరన్ ని తెలుగులో డబ్ చేస్తారో లేదో వేచి చూడాలి
Tags:    

Similar News