సుప్రీమ్ హీరో సాయి తేజ్ - 'ప్రస్థానం' దేవా కట్టా కాంబినేషన్ లో 'రిపబ్లిక్' అనే పొలిటికల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. శాసన కార్య నిర్వాహక మరియు న్యాయవ్యవస్థ కలసి సక్రమంగా పని చేయడమే అసలైన రిపబ్లిక్ అంటూ పోస్టర్ తోనే వెల్లడించి ఇందులో ఏదో బలమైన పాయింట్ చెప్పబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
ఇదిలావుండగా 'రిపబ్లిక్' చిత్రంలో ఐఏఎస్ గా.. వెస్ట్ గోదావరి కలెక్టర్ గా సాయి తేజ్ కనిపించబోతున్నాడట. అలానే ఈ సినిమాని ఆక్రమిత కొల్లేరు.. మిషన్ కొల్లేరు.. వెస్ట్ గోదావరి జిల్లాలో ఎవరకి కనిపించని క్రైమ్.. తదితర అంశాలు మీద ఫోకస్ పెడుతూ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం ఏలూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గత నెల రోజులుగా సాయి తేజ్ ఏలూరులోనే ఉన్నాడని తెలుస్తోంది.
ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు - రమ్యకృష్ణ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. 'రిపబ్లిక్' చిత్రాన్ని సమ్మర్ కానుకగా జూన్ 4న విడుదల చేయనున్నారు.