హీరోయిన్ తండ్రికి అత‌నితో అయితే ఓకే!

Update: 2020-02-15 12:10 GMT
ఏదో ఒక వేడెక్కించే టాపిక్ లేనిదే కాఫీ విత్ క‌ర‌ణ్ షో ఉండ‌దు అన్న సంగ‌తి టీవీక్ష‌కుల‌కు తెలిసిందే. సెల‌బ్రిటీల లైఫ్ లో ఎన్నో నిజాల్ని ఈ రియాలిటీ షో బ‌హిర్గ‌తం చేస్తోంది. సెల‌బ్రిటీల ఇన్న‌ర్ ప‌ర్స‌నాలిటీకి ఈ షో ప్ర‌తిబింబం అన‌డంలో సందేహం లేదు. ఒక్కోసారి సెన్సేష‌న్స్ కోస‌మో.. లేక టీఆర్పీ పెంచేందుకో కానీ సెల‌బ్రిటీలు అదుపు త‌ప్పి మాట్లాడేస్తుంటారు. ఆపై నాలుక క‌రుచుకునే లోపే నెటిజ‌నుల నుంచి చీవాట్లు ఎదుర‌వుతుంటాయి.

ఇక ఈ షోలో ఇటీవ‌ల ఫాద‌ర్ - డాట‌ర్ జోడీ సైఫ్ అలీఖాన్ - సారా అలీఖాన్ పాల్గొని ఆద్యంతం హీటెక్కించారు. తండ్రి కూతుళ్ల‌పై క‌రణ్‌ ర‌క‌ర‌కాల కొంటె ప్ర‌శ్న‌ల్సి సంధిస్తే వాటికి సైఫ్ ఇచ్చిన ఆన్స‌ర్లు ఒక ర‌కంగా అభిమానుల‌కే కాదు సారాకు షాకిచ్చాయి. ఓవైపు త‌న తండ్రి అనేది రాంగ్ రాంగ్ అంటూనే సారా దానిని క‌వ‌ర్ చేసేందుకు నానా తంటాలు ప‌డింది. ఏ తండ్రి అయినా త‌నకు కాబోయే అల్లుడు ఎలా ఉండాల‌ని ఆశిస్తాడో .. సైఫ్ అలానే ఆశించినా కాస్త అతి చేశాడ‌నే అనిపించింది.

ఇంత‌కుముందు హీరో కార్తీక్ ఆర్య‌న్ - సారా ఖాన్ (ల‌వ్ ఆజ్ క‌ల్ జోడీ) ఒకానొక‌ షోలో కార్తీక్ అందమైనవాడు.. అతనితో డేటింగ్ చేయాలనుకుంటున్నాన‌ని అంది. సారా తండ్రి సైఫ్ అలీ ఖాన్‌ను తన అల్లుడిగా అంగీకరించమని ఎలా ఒప్పించాలో అంటూ కార్తీక్ ఆర్య‌న్ ఓ సంద‌ర్భం లో స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు.

ఇంత‌కీ కూతురికి ఎలాంటి వాడు కావాలి? అంటే.. సైఫ్ ఇచ్చిన ఆన్స‌ర్ షాకిచ్చింది. సారాతో డేటింగ్ చేసే ఎవరైనా అప‌రిమితంగా డబ్బును సంపాదించిన‌వాడై ఉండాలని సైఫ్ వెల్లడించారు. సారా కాబోయే ల‌వ‌ర్ ని తాను ఏం అడుగుతాడో కూడా సైఫ్ వెల్లడించాడు. ``రాజకీయ అభిప్రాయాలు.. మాదకద్రవ్యాల`` గురించి ప్ర‌శ్నిస్తాన‌ని అన్నారు. కరణ్ జోక్యం చేసుకుని ``డబ్బు పై మంచి ప్రశ్న అవుతుంది. నేను అడుగుతాను`` అంటూ న‌వ్వేశాడు. ``డ‌బ్బు ఉందా.. గెట్ హెర్`` అంటూ సైఫ్ స‌ర‌దాగా ఆన్స‌ర్ చేశారు. కార్తీక్ తో డేటింగ్ చేస్తానని సారా అన‌డంతో.. ``అతని వద్ద డబ్బు ఉందా? డబ్బు తెచ్చి.. తీసుకెళ్ల‌మ‌ను`` అంటూ సైఫ్ జోక్ చేసాడు. ఇక కార్తీక్ సైతం ఆ త‌ర్వాత‌ క‌ర‌ణ్ షోలో.. ఇంకా యువరాణి సారా కోసం అంత డబ్బు సంపాదించలేదని అన్నాడు.

మొత్తానికి క‌ర‌ణ్ షోల్లో సైఫ్ డ‌బ్బు పిచ్చి.. సారా ప్రేమ పిచ్చి బ‌య‌ట‌ప‌డ్డాయి. దాంతో పాటే కార్తీక్ ఆర్య‌న్ చిలిపిద‌నం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే కార్తీక్ ఆర్య‌న్ బాలీవుడ్ లో ఫేమ‌స్ స్టార్. గాళ్స్ లో అత‌డికి అప‌రిమిత‌మైన ఫాలోయింగ్ ఉంది. అందుకే సైఫ్ కి కార్తీక్ అంటే ఇష్ట‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. కూతురికి అలా బాగా సంపాదించే భ‌ర్త‌నే రావాల‌ని కోరుకుంటున్నాడు. ఇప్ప‌టికే కార్తీక్ బాగా డబ్బు సంపాదించినట్లు కనిపిస్తోంది. కార్తీక్ -సారా జంట‌గా న‌టించిన `లవ్ ఆజ్ కల్` ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు కానుక‌గా రిలీజైంది. ఈ చిత్రంలో అరుషి శర్మ- రణదీప్ హుడా న‌టించారు.


Tags:    

Similar News