సైఫ్.. మాటలతో మంటలు రేపాడు

Update: 2015-07-26 14:23 GMT
కత్రినా కైఫ్ లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండటం కంటే అదృష్ణం ఏముందంటున్నాడు సైఫ్ అలీ ఖాన్. తన సరసన ఫాంటమ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కత్రినాను ఈ మధ్య ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆకాశానికెత్తేశాడు సైఫ్. ‘‘నాతో కలిసి నటించిన అత్యంత అందమైన హీరోయిన్లలో కత్రిన ఒకరు. రేస్ సినిమా చేసే సమయంలోనే ఆమె దేశంలోనే పెద్ద స్టార్ అవుతుందని ఊహించాను. తెరపై సన్నివేశాలు పండించేందుకు ఆమె పడే కష్టం అంతా ఇంతా కాదు. వ్యక్తిగతంగానూ ఆమె అంటే నాకు చాలా ఇష్టం. తనతో మాట్లాడ్డం, కలిసి పని చేయడం చాలా ఇష్టం. మా ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. తన లాంటి గర్ల్ ఫ్రెండు ఉంటే ఎవరైనా అదృష్టవంతులే’’ అంటూ కత్రినాపై తన అభిమానాన్నంతా దాచుకోకుండా కక్కేశాడు సైఫ్.

కానీ సైఫ్ మాటల్ని అతడి భార్య కరీనా కపూర్ - కత్రినా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరం. కరీనా అయినా సర్దుకుపోతుందేమో కానీ.. కత్రినాకే రణబీర్ తో కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే పెళ్లి కోసం కత్రినా ఎంత తొందర పెడుతున్నా అతను తర్వాత తర్వాత అని వాయిదా వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సైఫ్ మాటల్ని బట్టి చూస్తుంటే కత్రినా లాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకడం నీ అదృష్టం.. వెంటనే పెళ్లిచేసుకోరా బాబూ అని చెబుతున్నట్లున్నాయి. మరి రణబీర్ ఏం చేస్తాడో ఏమో!
Tags:    

Similar News