ఆ చ‌ట్టాన్ని వ్య‌తిరేకించ‌డంపై ఇంకా డిసైడ్ కాలేద‌న్న హీరో!

Update: 2019-12-25 08:05 GMT
పౌర‌స‌త్వ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ల బిల్లు విష‌యంలో కొంద‌రు సెల‌బ్రిటీలు స్పందించారు. మ‌రి కొంద‌రు కామ్ గా ఉన్నారు. వివిధ సామాజిక ప‌రిణామాల‌పై స్పందించే సెల‌బ్రిటీలు కొంద‌రు ఈ బిల్లుపై స్పందించారు. వారిలో చాలా మంది ఈ స‌వ‌ర‌ణ‌ల‌ను వ్య‌తిరేకించిన వాళ్లే!

ఈ బిల్లును స్వాగ‌తిస్తూ సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు చేసిన వారు త‌క్కువ మందే. కొంద‌రు అయితే ఈ బిల్లును తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ రెచ్చిపోయారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని విమ‌ర్శించిన సినీ సెల‌బ్రిటీలు కూడా ఉన్నారు.

వారి సంగ‌త‌లా ఉంటే.. ఈ అంశంపై కాస్త లేటుగా స్పందించాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్. కేవ‌లం హీరో మాత్ర‌మే గాక‌, ప‌టౌడీ వంశంలో ప్ర‌స్తుత రాజు కూడా ఇత‌డే. వీరి సంస్థానం ఇప్పుడు లేదు కానీ.. ప‌ట్టాభిషేక సంప్రదాయాలు మాత్రం కొన‌సాగుతూ ఉన్నాయి.
 
ఈ నేప‌థ్యంలో ముస్లిం వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న సీఏఏ విష‌యంలో సైఫ్ ఆస‌క్తిదాయ‌కంగా స్పందించాడు. అదే వ‌ర్గానికి చెందిన ఈ హీరో ఆ బిల్లును వ్య‌తిరేకించే విష‌యంలో ఇంకా ఒక నిర్ణ‌యానికి రాలేద‌న్నాడు. త‌ను ఆ అంశం గురించి పూర్తిగా అధ్య‌య‌నం చేయ‌లేద‌న్న‌ట్టుగా సైఫ్ స్పందించాడు. అలాగే నిర‌స‌న‌లు తెల‌పాల‌నే వారికి  ఆ హ‌క్కు ఉంటుంద‌ని, కానీ ఆందోళ‌న‌లు శాంతీయుతంగా ఉండాల‌ని సైఫ్ వ్యాఖ్యానించాడు. మొత్తానికి ఆ బిల్లు విష‌యంలో ఆచితూచి స్పందించిన‌ట్టుగా ఉన్నాడు ఈ హీరో!
Tags:    

Similar News