"ఆదిపురుష్" సినిమాతో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంలో.. ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ కనిపించనున్నారు. భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణంలో నటించిన సైఫ్.. ఇప్పుడు మహాభారతంలోనూ నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి సైఫ్ అలీఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ''విక్రమ్ వేద''. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై స్పందించారు.
'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' మాదిరిగా మహాభారతాన్ని భారీ చిత్రంగా తెరకెక్కిస్తే.. అలాంటి ప్రాజెక్ట్ లో నటించాలనుకుంటున్నానని సైఫ్ అలీఖాన్ తెలిపారు. 'కచ్చే ధాగే' సినిమా అప్పటి నుంచే అజయ్ దేవగన్ తో కలిసి మహాభారతం ప్రాజెక్ట్ గురించి చర్చించుకుంటున్నామని చెప్పారు.
మహాభారతం తమ జనరేషన్ కు ఒక డ్రీమ్ అని.. ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్ లో భాగం కావాలని కోరుకుంటారని సైఫ్ పేర్కొన్నారు. బాలీవుడ్ మరియు దక్షిణాది చిత్ర పరిశ్రమ కలిసి ఈ భారీ ప్రాజెక్ ను తెరకెక్కించాలని సైఫ్ అలీఖాన్ అభిప్రాయ పడ్డారు.
సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం 'ఆదిపురుష్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాఘవగా ప్రభాస్ నటించగా.. లంకేశ్ గా సైఫ్ నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. రావణాసురుడిగా సైఫ్ లుక్ అస్సలు బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు.
రావణ బ్రహ్మ అనగానే అందరూ ఊహించుకునే రూపానికి.. 'ఆది పురుష్' లో సైఫ్ కనిపించిన విధానానికి పొంతనే లేదని వ్యాఖ్యానించారు. ట్రెండీ హెయిర్ స్టైల్ తో అలావుద్దీన్ ఖిల్జీగా కనిపించారని అభిప్రాయ పడ్డారు. నుదుటిన అడ్డంగా విభూతి రాసుకున్నా.. మోడ్రన్ రావణుడు ఏమాత్రం శివ భక్తుడు అనే భావన కలగడం లేదని అంటున్నారు.
నిజానికి రావణ బ్రహ్మ పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ను ఎంచుకున్నప్పుడే ఓ వర్గం నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. శివ భక్తుడి పాత్ర కోసం ఒక ముస్లిం నటుడిని తీసుకోవడం సరైంది కాదంటూ మేకర్స్ పై మండిపడ్డారు. దీనికి తగ్గట్టుగానే లంకేశ్ పాత్ర గురించి నటుడు చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఆజ్యం పోశాయి.
రామాయణంలో రావణుడు పాత్ర విషయంలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న సైఫ్ అలీఖాన్.. మరో ఇతిహాసం మహాభారట్తంలోనూ భాగం కావాలని కోరుకుంటున్నాడు. మరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చి.. అతని కోరిక నెరవేర్చుతుందేమో వేచి చూడాలి.
'ఆదిపురుష్' సినిమా 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం కన్నడతో సహా పలు ప్రధాన భారతీయ భాషల్లో 2D - 3D - IMAX ఫార్మాట్లలో విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.