ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల మార్కు వసూళ్లను సాధించడం అంటే మీడియం రేంజ్ హీరోలకు కాసింత గట్టి విషయమే. ఇప్పటివరకూ నాని ఒక్కడే ఈజీగా ఈ మార్కును అందుకోగలిగే స్థాయిలో ఉన్నాడు. ఓవో ఒకటి రెండు సినిమాలు ఆడేసినా.. మిగిలిన హీరోలకు ఇది కాసింత కష్ట సాధ్యంగానే ఉంది.
ఇప్పుడు అక్కినేని నాగచైతన్య కూడా ఆ మార్కును కచ్చితంగా అందుకోవాల్సి వస్తోంది. శైలజా రెడ్డి అల్లుడు అంటూ చైతు హీరోగా ఓ సినిమా దాదాపుగా పూర్తి కావస్తోంది. వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఉండగా.. ఇప్పుడు బిజినెస్ వ్యవహారాలు చకచకా పూర్తి చేస్తున్నారు. ఓవర్సీస్ లో ఈ మూవీకి ఇప్పుడు డీల్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. 3.1 కోట్ల రూపాయలకు ఓవర్సీస్ రైట్లు విక్రయించారని టాక్ వినిపిస్తోంది. ఇంత షేర్ సాధించాలంటే అక్కడ వసూళ్లు దాదాపు మిలియన్ డాలర్ల రేంజ్ లో ఉండాలి. అక్కడ 55 శాతం మేరకే షేర్ రూపంలో వస్తుంది. పైగా ఖర్చులు ఉండనే ఉంటాయి.
మార్కెట్ ప్రకారం చూస్తే.. చైతుకు ఇది కొంచెం కష్టమైన విషయమే కానీ.. ఈ మూవీ దర్శకుడు మారుతి. ఫన్ కంటెంట్ సినిమాలు రూపొందించే మారుతిపై అక్కడ నమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ దర్శకుడి గత చిత్రాలు మహానుభావుడు.. భలే భలే మగాడివోయ్.. బాగా ఫేర్ చేశాయి. అందుకే శైలజా రెడ్డి అల్లుడిపై కాన్ఫిడెంట్ గా ఇంత మొత్తం పెట్టేశారట.