మీటూ : కుక్కతో చేసేందుకు సిద్దమా అన్నాడు!

Update: 2018-11-02 04:34 GMT
బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ గా పేరు దక్కించుకున్న సాజిద్‌ ఖాన్‌ పై వరుసగా హీరోయిన్స్‌ మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోయిన్స్‌ ఆయన గురించి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. వరుస లైంగిక ఆరోపణల నేపథ్యంలో సాజిద్‌ ఖాన్‌ కెరీర్‌ నాశనం అయ్యింది. ఆయన చేతిలో ఉన్న సినిమాలు చేజారి పోవడంతో పాటు, ఆయనతో సినీ వర్గాల వారు ఏ ఒక్కరు కూడా టచ్‌ లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి సమయంలో మరో నటి అహానా కుమ్రా కూడా సాజిద్‌ ఖాన్‌ పై సంచలన ఆరోపణలు చేసింది.

తాజాగా మీటూ ఉద్యమంలో భాగంగా మీడియా ముందుకు వచ్చిన అహానా మాట్లాడుతూ.. సాజిద్‌ గురించి ఎంతో మంది నాకు చెప్పారు. అయినా కూడా ఆయన ఇంటికి రమ్మని పిలిచిన సమయంలో తప్పని సరి పరిస్థితుల్లో వెళ్లాను. అక్కడ సాజిద్‌ ఒక చీకటి గదిలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. నేను బయట మాట్లాడుకుందాం అన్నాను. బయన నా తల్లి ఉన్నారు. ఆమెకు ఇబ్బంది కల్గించడం నాకు ఇష్టం లేదు, అందుకే గదిలో మాట్లాడుదాం అంటూ లోనికి తీసుకు వెళ్లాడు.

ఆయన ప్రవర్తన నాకు అనుమానంను కలిగించింది. నా తల్లి పోలీసు ఆఫీసర్‌ అంటూ ఆయనకు చెప్పాను. అయినా కూడా అతడు పట్టించుకోకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాతో కుల్లు జోకు వేస్తూ నన్ను నవ్వించేందుకు ప్రయత్నించాడు. 100 కోట్లు ఇస్తాను కుక్కతో నీవు సెక్స్‌ కు ఓకే చెప్తావా అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలకు నేను నవ్వాలన్నది ఆయన అభిప్రాయం. అత్యంత అసహ్యకరంగా జోకులు వేయడంతో పాటు, అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ అహానా పేర్కొంది.

ఇప్పటికే సాజిద్‌ ఖాన్‌ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో అహానా వ్యాఖ్యలతో ఉన్న పరువు కాస్త పోయింది. సినీ కెరీర్‌ దాదాపుగా ఖతం అయిన సాజిద్‌ ఖాన్‌ పై పోలీసు కేసులు కూడా నమోదు అవుతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Tags:    

Similar News