సాక్షికి ఆక్సిజన్ పట్టిస్తున్న హీరో

Update: 2016-12-01 02:03 GMT
టాలీవుడ్ లో మూడేళ్ల క్రితం పోటుగాడుతో అరంగేట్రం చేసి.. అక్కడి నుంచి పాట్లు పడుతోంది సాక్షి చౌదరి. ఆ తర్వాత అల్లరి నరేష్ తో రెండు సినిమాలు చేసి.. ఇప్పుడు తమిళ్.. హిందీల్లో కూడా ఒక్కో సినిమా చొప్పున చేస్తోంది. మూడు భాషల్లో ప్రయత్నిస్తున్నా ఈ మోడల్ కి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ఇప్పుడీ భామకు అనుకోకుండా ఓ ఛాన్స్ వచ్చింది. గోపీచంద్ తో ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తీస్తున్న ఆక్సిజన్ మూవీలో ఐటెం సాంగ్ లో కనిపించనుంది సాక్షి. ఇప్పటికే ఈ పాట షూటింగ్ కూడా పూర్తయిపోగా.. సాంగ్ అదిరిపోయే రేంజ్ లో వచ్చిందని చెబుతోంది యూనిట్. 'అరె అదిరిందే.. నువ్వు కాలరెగరేసి వస్తుంటే' అని సాక్షి పాడుతుంటే.. గోపీచంద్ తెగ స్టెప్పులు వేసేశాడట. ఇది ఐటెం సాంగ్ అయినా.. సిట్యుయేషన్ ప్రకారం వచ్చేది కావడంతో.. ఈ పాటలో హీరోయిన్ రాశిఖన్నా.. కమెడియన్ ఆలీలు కూడా డ్యాన్సులు వేస్తారట.

రాశి ఖన్నా లీడ్ హీరోయిన్ కాగా.. అను ఇమ్మాన్యుయేల్ సెకండ్ హీరోయిన్.. సాక్షి చౌదరితో స్పెషల్ సాంగ్. మొత్తం మీద ఆక్సిజన్ లో ముగ్గురు భామలతో చిందులు వేసేస్తున్నాడు గోపీచంద్. వీళ్ళందరూ మనోడికి హిట్టు కిక్కిస్తారేమో చూడాలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News