ఇప్పుడు సినిమాలకు శాటిలైట్ హక్కులనేవి ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్నాయి అన్నది నిజం. సినిమా హిట్ అయినా తేడా వచ్చినా టీవీ లేదా యు ట్యూబ్ రూపంలో దానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకునేందుకు ప్రస్తుతం ఛానల్స్ విపరీతంగా పోటీ పడుతున్నాయి. సినిమా హిట్ అయ్యిందా రెట్టింపు కనక వర్షం. ఏదైనా తేడా వచ్చిందా పెట్టుబడితో పాటు తక్కువ లాభాలు గ్యారెంటీ. ఈ ఫార్ములాతోనే కాంబినేషన్లు సెట్ చేసుకుని మరీ ఇప్పుడు సినిమాలు రూపొందుతున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న కొత్త సినిమా 'సాక్ష్యం' షూటింగ్ కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. మేలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీలో డిజే బ్యూటీ పూజా హెగ్డే హీరొయిన్. డిజే తర్వాత ఏ సినిమా ఒప్పుకోని పూజా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది.
ఇప్పుడు ఈ సాక్ష్యంకు శాటిలైట్ హక్కుల రూపం జీ ఛానల్ 5.5 కోట్లకు ఒప్పందం చేసుకుంది అనే వార్త టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఆశ్చర్యకరంగా హింది రైట్స్ అంత కంటే ఎక్కువగా 8 కోట్లకు అమ్ముడుపోవడం మరో సెన్సేషన్. దీనికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు. సాయి శ్రీనివాస్ చేసింది తక్కువ సినిమాలే అయినా శాటిలైట్ వరకు మంచి రెవిన్యూ రాబడుతున్నాడు. జీ తెలుగులో జయ జానకి నాయక మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 16 దాకా రేటింగ్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. ఒక అప్ కమింగ్ హీరోకి ఇది భారీ రేటింగ్. దెబ్బకు తక్కువ సమయంలోనే మొత్తం మూడు సార్లు ప్రసారం చేసి బాగా గిట్టుబాటు చేసుకుంది జీ తెలుగు.
ఇదే ఎత్తుగడతో ఇప్పుడు సాక్ష్యం కొన్నట్టు తెలిసింది. డిఫరెంట్ సబ్జెక్టు కావడంతో సక్సెస్ అయితే అంతకంతా ఒక్కసారే వెనక్కు వస్తుంది. లేదా రెండో మూడో సారో లాభాల్లోకి రావొచ్చు. పూజా గ్లామర్, దర్శకుడు శ్రీవాస్ మాస్ సినిమాలు బాగా డీల్ చేస్తాడనే బ్రాండ్ డిక్టేటర్ తో రావడం తదితర కారణాల వల్ల మంచి ధర దక్కిందని తెలిసింది. పంచ భూతలకు ప్రేమ కథను లింక్ చేసి చాలా విభిన్నంగా దీన్ని రూపొందిస్తున్నట్టు టాక్ ఉంది.